సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని దత్తోజిపేట, లక్ష్మీపూర్, వెంకట్రపల్లి గ్రామాల్లో సింగిల్ విండో సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైస్ చైర్మన్ రవీందర్ ప్రారంభించారు. వెలిచాల గ్రామంలో సర్పంచ్ వీర్ల సరోజ కొనుగోలు సెంటర్‌ను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో డైరెక్టర్లు ధ్యావ అనంతరెడ్డి, ఊట్కూరి అనిల్ రెడ్డి, లచ్చయ్య, కరుణాకర్, వీర్ల రవీందర్ రావు, సిబ్బంది మల్లేశం, నరేష్, ఇతర రైతులు పాల్గొన్నారు.
సారథి, రామడుగు: అధికారులు, ప్రజాప్రతినిధులు జోడెడ్ల కచ్చురం లాగా సమన్వయంతో పనిచేయాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ సూచించారు. 45 ఏండ్లు నిండిన వారంతా విధిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని, ఆ బాధ్యతను ప్రజాప్రతినిధులు తీసుకోవాలని కోరారు. గురువారం కరీంనగర్ జిల్లా రామడుగు ఎంపీడీవో ఆఫీసులో ఎంపీపీ కల్గెటి కవిత అధ్యక్షతన జనరల్‌బాడీ సమావేశం నిర్వహించారు. కరోనా దృష్ట్యా ప్రజలు మాస్కులు ధరించాలని, శానిటైసర్లు వాడేలా ప్రజాప్రతినిధులు అధికారులు అవగాహన కల్పించాలని కోరారు. ప్రజలకు అందుబాటులో […]
సారథి, రామడుగు: నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో యువత ఆత్మహత్యలకు పాల్పడడం విచారకరమని, నిరుద్యోగ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని, అందుకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిబాధ్యత వహించాలని బీజేవైఎం కరీంనగర్ జిల్లా రామడుగు అధ్యక్షుడు దుర్శెటి రమేష్ అన్నారు. నిరుద్యోగ సమస్యతో ఆత్మహత్య పాల్పడిన మహేందర్ యాదవ్, ప్రైవేట్టీచర్ వెన్నం రవికుమార్ ఆత్మహత్యలపై అసమర్థ ప్రభుత్వ పాలనకు నిరసనగా రామడుగు మండల బీజేవైఎం శాఖ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను […]
సారథి, రామడుగు: నీళ్లు లేక పంటలు ఎండిపోయిన రైతులకు పరిహారం అందజేసి ఆదుకోవాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ నేతలు మండలంలోని వెదిర, దేశరాజ్ పల్లి గ్రామాల్లో ఎండిన పంట పొలాలను స్థానిక సీపీఐ నాయకులతో కలిసి పరిశీలించారు. వెదిరలో రామారావు అనే రైతుకు చెందిన మూడెకరాల పొలం ఎండిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నాడని, ఎంతో శ్రమటోడ్చి పంట వేస్తే ఇలాంటి దుస్థితి వచ్చిందన్నారు. పంటలు ఎండిపోయినా, […]
సారథి, రామడుగు: దేశ సంస్కృతి సంప్రదాయాలకు బీజేపీ ప్రతీక అని రామడుగు పార్టీ మండలాధ్యక్షుడు ఒంటెల కర్ణాకర్ రెడ్డి కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మండల కేంద్రంలో పార్టీ జెండాను ఎగరవేశారు. వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ర్టాల్లో కాషాయ జెండా ఎగరడం కాయమన్నారు. కార్యక్రమంలో కారుపాకల అంజి, సంటి జితేందర్, కొలపురి రమేష్, జిట్టవేని అంజిబాబు, దురుశెట్టి రమేష్, రాంలక్ష్మణ్, మాడిశెట్టి అనిల్, రాగం కనకయ్య, నీలం లక్ష్మీరాజాం, పరశురాం, అంజి పాల్గొన్నారు.
సారథి, రామడుగు: రామడుగు జడ్పీ హైస్కూల్ లో చదువుకున్న 1990-1991 పదవ క్లాస్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం కరీంనగర్ లోని వీపార్క్ హోటల్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. 30 ఏళ్ల తర్వాత అందరూ ఒకచోట కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. కార్యక్రమంలో గోపాల్ రావుపేట ఏఎంసీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కలిగేటి లక్ష్మణ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఎడవేల్లి నరేందర్ రెడ్డి, గోలిరామయ్యపల్లి […]
సారథి, రామడుగు: రామడుగు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చొప్పదండి సీఐ నాగేశ్వర్ రావును ఘనంగా సన్మానించారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో మర్యాదపూర్వకంగా కలసి మండలంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన సీఐ సమస్యల పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని మాస్కులు, శానిటైజర్లు వాడాలని సూచించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వంచే రాజిరెడ్డి, గౌరవాధ్యక్షుడు గంటే భాస్కర్, ప్రధాన కార్యదర్శి కాసరపు తిరుపతి గౌడ్, సభ్యులు […]
సారథి, రామడుగు: క్రీడలు మానసిక వికాస అభివృద్ధికి తోడ్పడుతాయని సర్పంచ్ పంజాల ప్రమీల అన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని గడికోట క్రీడామైదానంలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నీ గురువారం నిర్వహించారు. క్రీడలు వ్యక్తి మానసిక పరిపక్వతతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ప్రతి క్రీడాకారుడు స్నేహభావంతో మెలగాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పురేళ్ల గోపాల్, ఉపసర్పంచ్ వడ్లూరి రాజేందర్, కార్యదర్శి మధుసూదన్, మాజీ సర్పంచ్ పంజాల జగన్ మోహన్, మాజీవార్డు సభ్యులు ఐతరవేని […]