సారథి న్యూస్, ఖమ్మం: ఖమ్మం నియోజకవర్గ పరిధిలోని రఘునాథపాలెం మండల కేంద్రంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రూ.40 లక్షలు సొంత ఖర్చులతో తన దివంగత సోదరుడు పువ్వాడ ఉదయ్ కుమార్ స్మారకార్థం రైతుల కోసం నిర్మించిన రైతువేదిక భవనాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సన్న ఒడ్లను కొంటామని స్పష్టంచేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ప్రధాని సొంతం రాష్ట్రం […]
సారథి న్యూస్, హైదరాబాద్: మహబూబాబాద్, ములుగు, ఖమ్మం జిల్లాల్లోని ఇల్లందు, పాలేరు, వైరా, సత్తుపల్లి, పినపాక, ములుగు నియోజకవర్గాల్లోని భూములకు సాగునీరు అందించేందుకు వీలుగా సీతారామ ప్రాజెక్టును విస్తరించే పనులపై రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశుసంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ నేతృత్వంలో ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. భక్త రామదాసు ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టును ఒకేసారి పూర్తిచేస్తామని సీఎం కేసీఆర్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: మంత్రులుగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా మంగళవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దంపతులను గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఉత్తమ సేవలు అందించి ప్రజల అభిమానం చూరగొనాలని సీఎం ఆకాంక్షించారు.
సారథి న్యూస్, ఖమ్మం: ఖమ్మం జిల్లాకు చెందిన కరోనా అనుమానితలు పరీక్షల కోసం ఇకనుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదని.. త్వరలో ఖమ్మం జిల్లాకేంద్రంలోనే కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. ఖమ్మంలో కరోనా పరీక్షలు చేయాలంటూ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్.. ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ను కోరగా అందుకు ఆయన అనుమతించారని చెప్పారు. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు. […]
సారథిన్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల గ్రామంలో రూ.1.19 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 10 పడకలవార్డు, సిబ్బంది నివాస సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ మలోతు కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యే పొదెం వీరయ్య, […]
ఖమ్మం: టీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతున్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 41, 43వ డివిజన్ మిర్చి మార్కెట్ రోడ్ లో రూ.కోటితో నిర్మించిన డబుల్ రోడ్, సెంట్రల్ లైటింగ్ పనులను మేయర్ పాపాలాల్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, కార్పొరేటర్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
సారథిన్యూస్, ఖమ్మం: ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో రాష్ట్రానికే ఆదర్శనీయంగా రైతు వేదిక నిర్మిస్తున్నామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. రైతు వేదిక నిర్మాణపనులను బుధవారం మంత్రి పరిశీలించారు. ఈ రైతు వేదికను మంత్రి అజయ్ రూ.40 లక్షలు సొంత నిధులు వెచ్చించి నిర్మిస్తున్నారు. మంత్రి వెంట కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎమ్మెల్సీ బాలసాని, రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, ఏఎమ్సీ చైర్మన్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
సారథిన్యూస్, కొత్తగూడెం: సుడా చైర్మన్ గా బచ్చు విజయ్ కుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో తన కుర్చీలో కూర్చొని సంతకం చేశారు. అనంతరం విజయ్‌కి .. మంత్రి పువ్వాడ శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మేయర్ పాపాలాల్ , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తదితరులు పాల్గొన్నారు.