సారథి న్యూస్, పెద్ద శంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట పీహెచ్సీని రాష్ట్ర కోవిడ్ బృందం మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసింది. పీహెచ్సీ పరిధిలో ఇప్పటివరకు ఎన్ని కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో ఎన్ని పాజిటివ్ వచ్చాయి తదితర వివరాల గురించి రాష్ట్ర బృందం ఆరా తీసింది. డాక్టర్ ప్రభావతి నేతృత్వంలోని రాష్ట్ర బృందం పీహెచ్సీ రికార్డులను పరిశీలించింది. కార్యక్రమంలో పీహెచ్సీ సిబ్బంది భూమయ్య, రామ్మోహన్, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
మానోపాడు: కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో పరిశుభ్రత ఎంతో ముఖ్యమని జోగుళాంబ గద్వాల డీఎంహెచ్వో చందునాయక్ పేర్కొన్నారు. గురువారం ఆయన మానోపాడు పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆస్పత్రిలోని అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పీహెచ్సీ ఆవరణలో చెత్త పేరుకుపోయి ఉండటంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసవాల సంఖ్యను పెంచాలని సూచించారు. రోగులకు విధిగా శానిటైజర్ లను అందించడంతోపాటు కరోన మహమ్మారి పట్ల భయం తొలగించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సవిత, సూపరవైజర్లు చంద్రన్న, లలిత […]
సారథి న్యూస్, రామడుగు : రామడుగు పీహెచ్సీని కరీంనగర్ డీఎంహెచ్వో జి.సుజాత బుధవారం సందర్శించారు. పలు రికార్డులను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్యంపై ఆరాతీశారు. ఆరోగ్య కేంద్రం పరిధిలో గల ముంబై, మహారాష్ట్ర లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హోమ్ క్వారంటైన్ లో ఉంటున్న వారికి పలు సూచనలు చేశారు. కరోనా లక్షణాలు గల అనుమానితులను జిల్లా క్వారంటైన్ కు రెఫర్ చేయాలని సూచించారు. ఆమె వెంట మండల వైద్యాధికారి శ్రీనివాస్ తో పాటు వైద్య […]