Breaking News

PEDDASHANKARAMPET

చకచకా పల్లె ప్రగతి పనులు

చకచకా పల్లె ప్రగతి పనులు

సారథి న్యూస్​, పెద్దశంకరంపేట: మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట మండలం బూరుగుపల్లిలో శుక్రవారం పల్లె ప్రకృతి వనం పనులను సర్పంచ్​ సరిత మల్లేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రకృతివనం చుట్టూ ఫెన్సింగ్​ చుట్టి తొందరగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రమావత్ రాజు, ఈజీఎస్ ఏపీవో సుధాకర్, టీఎస్ సుభాష్, విఠల్​ నాయక్​, విజయ్, కోటయ్య పాల్గొన్నారు.పల్లె ప్రగతి పనులపై ఆరామండలంలోని ఆయా గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర […]

Read More
బడుగు బలహీనవర్గాల అభివృద్ధే ధ్యేయం

బడుగు బలహీనవర్గాల అభివృద్ధే ధ్యేయం

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకుని ఎదగాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నారాయణఖేడ్ క్యాంపు కార్యాలయంలో పెద్దశంకరంపేట మండలంలోని మార్కెట్ పల్లి గ్రామానికి చెందిన యాదగిరికి ఆస్పత్రి ఖర్చుల కోసం రూ.15వేల సీఎం సహాయనిధి చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ విజయరామరాజు, సర్పంచ్ రమ్యఅశోక్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు దత్తు తదితరులు పాల్గొన్నారు.

Read More
ప్రజాసమస్యలు పరిష్కరించండి

ప్రజాసమస్యలు పరిష్కరించండి

సారథి న్యూస్​, పెద్దశంకరంపేట: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఐకేపీ ఏపీఎం, విద్యుత్ శాఖ సిబ్బంది పనితీరుపై మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పనితీరు మార్చుకుని ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు కృషిచేయాలని సూచించారు. శుక్రవారం రామాయంపేట పేట సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల మృతిచెందిన పెద్దశంకరంపేట 1వ ఎంపీటీసీ రాజమణి లక్ష్మీనారాయణ మృతికి నివాళులర్పించారు. బద్దారం, శివాయిపల్లి, చిల్లపల్లి, ఉత్తులూర్ గ్రామాల్లో కరెంట్ తీగలు కిందకు వేలాడుతున్నాయని ఆయా […]

Read More
ఆర్యవైశ్య సంఘం నేత సంగయ్య కన్నుమూత

ఆర్యవైశ్య సంఘం నేత సంగయ్య కన్నుమూత

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: ఆర్యవైశ్య సంఘం పెద్దశంకరంపేట మండలాధ్యక్షుడు రాగం సంగయ్య (73) బుధవారం ఉదయం కన్నుమూశారు. వారం రోజుల అతనికి కరోనా వ్యాధి నిర్ధారణ కావడంతో హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆయన మృతిచెందారు. రాగం సంగయ్య పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారని పలువురు కొనియాడారు. ఆయన మృతిపట్ల ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ విజయరామరాజు, పెద్దశంకరంపేట సర్పంచ్ సత్యనారాయణ, వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్, ఎంపీటీసీ […]

Read More
దళిత ఎమ్మెల్యేలపై దాడి హేయం

దళిత ఎమ్మెల్యేలపై దాడి హేయం

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: దళిత ఎమ్మెల్యేలపై బీజేపీ గుండాల దాడి హేయమైనచర్య అని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్), ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేపై దాడిచేసిన దుండగుల దిష్టిబొమ్మను మంగళవారం దహనం చేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్​ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అతిమేల మాణిక్యం మాట్లాడుతూ.. దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా సిద్దిపేటలోని స్వర్ణ ప్యాలేస్ హోటల్ లో ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని అన్నారు. దాడిచేసిన వారిపై అట్రాసిటీ కేసు […]

Read More
వైభవంగా భవానీ మాత పల్లకీసేవ

వైభవంగా భవానీ మాత పల్లకీసేవ

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: ఆశ్వయుజ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దశంకరంపేటలో శనివారం రాత్రి భవానీ మాత పల్లకీ సేవను వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై అమ్మవారిని ఊరేగిస్తూ.. స్థానిక భవానీ మాత మందిరం నుంచి పట్టణ పురవీధుల గుండా పల్లకీ సేవ నిర్వహించారు. భక్తులు భజనలు, కీర్తనలు పాడుతూ ముందుకుసాగారు. మహిళలు మంగళహారతులతో వచ్చి ప్రత్యేకపూజలు చేశారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Read More
నార్సింగిలో ఇంటింటి ప్రచారం

నార్సింగిలో ఇంటింటి ప్రచారం

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆదేశానుసారం దుబ్బాక నియోజకవర్గంలోని నార్సింగి గ్రామంలో శుక్రవారం ఇంటింటి ప్రచారంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్ పాల్గొన్నారు. వారి వెంట మాజీ ఎంపీపీ రాజు, పీఏసీఎస్​ వైస్ చైర్మన్ అంజయ్య, ఎంపీటీసీ దామోదర్, శివాయపల్లి సర్పంచ్ నరేష్, ఉపసర్పంచ్ అంజయ్య, కమలాపూర్ సర్పంచ్ రాములు, కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు గంగారం సంగయ్య, సెట్ రోషిరెడ్డి, గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read More
పందులకు పెట్టిన వైరు.. తండ్రికొడుకుల ప్రాణాలు తీసింది

పందులకు పెట్టిన వైరు.. ప్రాణాలు తీసింది

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: కరెంట్ ​షాక్​తో తండ్రి కొడుకులు ప్రాణాలు వదిలారు. ఈ విషాదకర సంఘటన గురువారం రాత్రి మెదక్​జిల్లా పెద్దశంకరంపేట మండలం కొలపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఇస్కపాయల తండా పంచాయతీ పరిధిలోని కొలపల్లితండాకు చెందిన ధారవత్ హర్యానాయక్(51) కొలపల్లికి చెందిన చాకలి సాయిలు పొలాన్ని కౌలుకు పంట సాగు చేస్తున్నాడు. గురువారం రాత్రి పొలాన్ని నీళ్లు చూసేందుకు వెళ్లాడు. పక్క పొలానికి చెందిన చాకలి లింగం అడవి పందుల కోసం కరెంట్ వైర్ బిగించాడు. […]

Read More