సారథి న్యూస్, హైదరాబాద్: బీజేపీకి ఒక్కసారి అవకాశమిస్తే హైదరాబాద్ ను ఐటీ హబ్ గా అభివృద్ధి చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించారు. సిటీలో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చేస్తామన్నారు. ‘నిజాం సంస్కృతిని వదిలి.. నయా హైదరాబాద్ ను నిర్మిద్దాం.. కుటుంబ పాలన నుంచి ప్రజాస్వామ్యం వైపు వెళ్దాం.. అవినీతి నుంచి పారదర్శక పాలన తీసుకొద్దాం.. సంతుష్టీకరణ నుంచి సమష్టి అభివృద్ధి వైపు పయనిద్దాం..’ అని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజు ఆదివారం […]
సారథి న్యూస్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని పాత మొజంజాహి మార్కెట్ ను కూల్చివేసి నిర్మించిన మార్కెట్ సముదాయాన్ని మంత్రులు కె.తారకరామారావు, సబితాఇంద్రారెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, డిప్యూటీ సీఎం మహబూద్ అలీ శుక్రవారం ప్రారంభించారు. ఈ మార్కెట్‌ను 1933లో నిర్మించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే రాజాసింగ్, గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ పాల్గొన్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: ఓల్డ్‌సిటీ పరిధిలోని సంతోష్‌నగర్‌లో బస్తీదవాఖానను మంత్రులు కె.తారక రామారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ శుక్రవారం ప్రారంభించారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని వారు అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని వారు చెప్పారు. కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. యాకుత్‌పురా ఎమ్మెల్యే సయ్యద్ హైమద్ పాషాఖాద్రి, మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.