Breaking News

NEW CASES

చిన్నశంకరంపేటలో ఇద్దరికి కరోనా

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. స్థానిక పీహెచ్​సీలో సోమవారం 17 మందికి కరోనా పరీక్షలు చేశారు. వారిలో మడూర్, చందాపూర్ గ్రామాలకు చెందిన ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణి తెలిపారు. నేటితో మండలంలో 13 మందికి పాజిటివ్ రాగా నలుగురు రికవరీ అయ్యారని చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు.

Read More

45 వేల కొత్తకేసులు

న్యూఢిల్లీ: భారత్​లో కరోనా విలయతాండవం సృష్టిస్తున్నది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 45,720 కొత్తకేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. మొత్తం కేసుల సంఖ్య 12,38,635కు చేరింది. కాగా ఒకే రోజులో 29,557మంది కోలుకున్నారు. కాగా ఇప్పటివరకు 7,82,606 మంది కోలుకున్నారు. ఇప్పటివకరు 29,861 మంది ఈ వ్యాధితో మరణించారు. దేశంలో కేసులు విపరీతంగా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో కేసుల […]

Read More