నల్లగొండ, సారథి న్యూస్: పిల్ల నిచ్చిన మామను హత్యచేసిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండకు చెందిన చింతల గోపీ ఈ నెల 20న తన కుమారుడు రిత్విక్‌కు పుట్టు వెంట్రుకల వేడుక చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీలోని నందిగామ నుంచి అతడి మామ వంటిపులి వెంకటేశ్వర్లు వచ్చారు. తన కూతురును పుట్టింటికి తీసుకెళ్లేందుకు ఫంక్షన్నం అనంతరం నల్లగొండలోనే ఉండిపోయారు. మరునాడు మామా, అల్లుడు ఇంట్లోనే […]
సారథిన్యూస్, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో భారీగా నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. సుమారు రూ. 30 లక్షలు విలువైన 15 క్వింటాళ్ల పత్తి విత్తనాలను, వాటిని ప్యాకింగ్ చేసే మిషనరీని, సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా చండూరు మండలం కమ్మగూడెంలో నకిలీ విత్తనాలు ఉన్నట్టు పోలీసులకు సమాచారమందింది. కూపీ లాగగా.. ఏపీ, తెలంగాణకు చెందిన ఓ ముఠా ఈ నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు జోగుళాంబ గద్వాల, […]
సారథి న్యూస్ , నల్లగొండ: ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడి అందరి ప్రశంసలు అందుకున్నాడో ట్రాఫిక్ పోలీస్.నల్లగొండ జిల్లాకేంద్రంలోని క్లాక్‌టవర్ సెంటర్లో హఫీజ్ ట్రాఫిక్ పోలీస్‌గా పనీచేస్తున్నాడు. బుధవారం ఓ వాహనదారుడు కారులో రాంగ్రూట్లో వస్తుండగా.. హఫీజ్ అతడి కారును ఆపాడు. తాను చెన్నైకి చెందిన ఒక ట్రావెల్ ఏజెన్సీలో డ్రైవరుగా పని చేస్తున్నట్టు డ్రైవర్ తెలిపాడు. హైదరాబాద్ నుంచి నల్లగొండ వైపు వస్తుండగా.. చిట్యాలకు వచ్చినప్పటి నుంచి ఛాతిలో నొప్పి వస్తున్నదని.. […]
సారథి న్యూస్, నల్లగొండ: సామాజిక మాధ్యమాల ద్వారా అమ్మాయిలు, యువతులను హనీట్రాప్ చేసి, బ్లాక్ మెయిలింగ్ చేస్తూ.. లైంగిక వాంఛలు తీర్చుకుంటోన్న మోస్ట్ డెంజరస్ సైకో అఖిల్ ను మంగళవారం అరెస్ట్ చేశారు నల్లగొండ షీ-టీమ్ పోలీసులు. రెండు, మూడేళ్లుగా సోషల్ మీడియాలో యువతులు, మహిళలను లైంగికంగా కోరికలు తీర్చుకుంటున్నన్నట్లు విచారణలో వెల్లడించినట్లు నల్లగొండ ఎస్పీ రంగనాథ్ తెలిపారు. నిందితుడు అఖిల్ ఉచ్చులో పదుల సంఖ్యల పలువురు యువతులు, మహిళలు ఉన్నట్లు తేలడం గమనార్హం. సికింద్రాబాద్ లోని […]