సారథి ప్రతినిధి, నాగర్ కర్నూల్: జిల్లా రైతులు, ప్రజలకు నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మడం, సరఫరా చేయడం, తయారుచేయడం చేస్తే కఠినచర్యలు తప్పవని జిల్లా ఎస్పీ డాక్టర్ వై.సాయిశేఖర్ హెచ్చరించారు. వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు అలా చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. వ్యాపారం చేయుదలుచుకున్నవారు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడొద్దని సూచించారు. ప్రభుత్వం అనుమతి పొందిన కంపెనీకి చెందిన విత్తనాలను […]
సారథి ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో వరిధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించి అధికారులతో సమన్వయం చేసుకుంటూ కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, చివరి ధాన్యం వరకు ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలుచేస్తుందని భరోసా ఇచ్చారు. వర్షాలు పడుతుండటంతో […]
సారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి(డీఎంహెచ్ వో) డాక్టర్ కె.సుధాకర్ లాల్ సోమవారం తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిజినేపల్లి పీఎచ్ సీ పరిధిలో ప్రతి ఇంటిని సందర్శించి వారి ఆరోగ్యపరిస్థితులు తెలుసుకోవాలని సూచించారు. జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులు, గొంతు నొప్పి తదితర లక్షణాలు ఉన్న ఏ ఒక్కరినీ వదలకుండా నమోదుచేసుకుని, వారికి హోం ఐసొలేషన్ కిట్ ఇవ్వాలని సూచించారు. కరోనా […]
సారథి, బిజినేపల్లి: కరోనా బాధితులు, వారి కుటుంబాలకు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అండగా నిలిచారు. సోమవారం ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కరోనా బాధిత కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తిమ్మాజీపేట మండలంలోని పోతిరెడ్డిపల్లి, బిజినేపల్లి మండలంలోని గుడ్లనర్వ, నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిధిలోని ఉయ్యాలవాడ గ్రామంలో సరుకులు అందజేశారు. సంబంధిత కుటుంబాల్లో ఎమ్మె్ల్యే ధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపద సమయంలో […]
సారథి ప్రతినిధి, నాగర్ కర్నూల్: డెంగీ నివారణను మనం మన ఇంటి నుంచే మొదలుపెడదామని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. దోమల నివారణతోనే వ్యాధిని నివారించడం సాధ్యమవుతుందని, ఇంటి ఆవరణలో నీరు నిల్వలేకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. మే16న జాతీయ డెంగీ నివారణ దినాన్ని పురస్కరించుకొని శనివారం కలెక్టరేట్ క్యాంపు ఆఫీసు ఆవరణలో బ్యానర్, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డెంగీపై జిల్లా ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని […]
సారథి, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం కాంసానిపల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ యువకుడు కరోనాతో మృతిచెందాడు. యువకుడి మృతితో గ్రామస్తులంతా భయాందోళనకు గురయ్యారు. గ్రామంలో మొదటి కరోనా మరణం జరగడంతో గ్రామస్తులు, కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. శవాన్ని పూడ్చి పెట్టడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో సర్పంచ్ కర్నె లక్ష్మీనారాయణ పీపీఈ కిట్టు ధరించి అంత్యక్రియలు చేయడానికి ముందుకొచ్చారు. అక్కడే ఉన్న పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ తో పాటు మరో నలుగురు యువకులు సర్పంచ్ […]
సారథి, బిజినేపల్లి: సమాచార హక్కు చట్టం కింద సకాలంలో దరఖాస్తుదారుడికి సరైన సమాచారం ఇవ్వకపోవడంపై నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి తహసీల్దార్‌కు ఆర్టీఐ కమిషనర్ బుధవారం షోకాజ్ నోటీసులు జారీచేశారు. బిజినేపల్లి మండలం వడ్డేమాన్ గ్రామంలో 2012లో ఎంత మంది రైతులు ఖరీఫ్ సీజన్లో బీమా చెల్లించారో తనకు పూర్తి సమాచారం ఇవ్వాలని న్యాయవాది ఏసీబీ శ్రీరామ్ఆర్యా బిజినేపల్లి తహసీల్దార్‌కు దరఖాస్తు చేశారు. సమాచారం ఇవ్వకపోవడంతో నాగర్‌కర్నూల్ ఆర్డీవోకు అప్పీల్చేశారు. అయినా కూడా జిల్లా అధికారుల నుంచి సరైన […]
సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం శాయన్ పల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అవంతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఉపసర్పంచ్, వార్డు సభ్యుల ఫిర్యాదు మేరకు శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి శంకర్ నాయక్, డీఎల్పీవో రామ్మోహన్ గ్రామంలో విచారణ చేపట్టారు. ఎమ్మెల్సీ నిధుల నుంచి చేపట్టిన వీధిరైట్లు, ఇతర అభివృద్ధి పనులకు గ్రామపంచాయతీ నిధులు డ్రా చేశారని జిల్లా అధికారులకు వారు ఫిర్యాదు చేశారు. పంచాయతీ ట్రాక్టర్ ను సొంత పనులతో పాటు ఇష్టానుసారం […]