సారథి, చొప్పదండి: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతను కించపరిచేలా మాట్లాడిన వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మచ్చ రమేష్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ఉపాధి ఉద్యోగం అవకాశాల్లేక కుటుంబాలకు భారమై యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఈ తరుణంలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఉపాధి కోసం గ్రామాల్లో హమాలీ పనులు చేసుకోవాలని వ్యాఖ్యానించడం దుర్మార్గమని […]
సారథి ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ‘దిశ’ సమీక్ష సమావేశంలో తాను మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ కొన్ని మీడియా సంస్థలు సంచలనం కోసం ప్రసారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచిందని, ఏ ప్రభుత్వమూ ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కల్పించలేదని, ఉద్యోగం అంటేనే […]
సారథి, బిజినేపల్లి: వాతావరణ మార్పులకు అనుసంధానంగా స్థిరస్థాపక కుటుంబాల అభివృద్ధి(ఆర్ఏహెచ్యాక్ట్) అనే పథకం ద్వారా నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వడ్డెమాన్, లట్టుపల్లి, సల్కర్ పేట, వసంతపూర్, వట్టెం గ్రామాలకు చెందిన 231 మంది రైతులకు విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు పంపిణీ చేశారు. వర్షాధారంగా రైతులకు ఎకరానికి సరిపడా ఒక పత్తి ప్యాకెట్ రెండు కేజీల కంది విత్తనాలు (4:1) నిష్పత్తిలో అంతరపంటగా వేసేందుకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, మండల రైతు […]
ఉన్నత విద్య చదివేందుకు ఆర్థిక సహాయం అనంత జ్యోతిర్మయి సంస్థ ద్వారా సామాజికసేవ నలుగురు విద్యార్థులకు బంగారు భవిష్యత్ పదిమందికి సహకరించడమే సంకల్పం: అనంత నరసింహారెడ్డి సారథి ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నిరుపేద విద్యార్థుల పాలిట దైవంగా నిలిచారు రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ అనంత నరసింహారెడ్డి. సామాజిక సేవే ధ్యేయంగా తనవంతు కృషిచేస్తూ భరోసా కల్పిస్తున్నారు. అనంత జ్యోతిర్మయి అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అన్నిరంగాల్లో సామాజిక సేవ చేస్తూ […]
సారథి, బిజినేపల్లి: నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలోని పెంటోనిచెరువు తూము నుంచి రైతులకు చెరువు కింద సుమారు వెయ్యి ఎకరాల ఆయకట్టులో పంటలు సాగుచేసేందుకు వీలుగా సర్పంచ్ గోవింద్ లావణ్య నాగరాజు, ఎంపీపీ పుప్పాల శ్రీనివాస్ గౌడ్ సోమవారం నీటిని విడుదల చేశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా మిషన్ కాకతీయ ద్వారా ప్రతి గ్రామంలో చెరువులను నీటితో నింపిన ఘనత టీఆర్ఎస్ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతులు పంటలు పండించడానికి వీలుగా నీటి వసతి కల్పించిన నాగర్ […]
సారథి ప్రతినిధి, నాగర్‌కర్నూల్: రాష్ట్రకమిటీ పిలుపు మేరకు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అన్ని జిల్లాల కార్యవర్గాలను ఎన్నుకుంటామని ఉమ్మడి మహబూబ్‌నగర్‌జిల్లా టీజీవో కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి(ఆర్టీవో) స్పష్టంచేశారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా పి.రాజశేఖర్ రావు, ప్రధాన కార్యదర్శిగా భగవేణి నరసింహులు, ఉపాధ్యక్షులుగా వి.తిరుపతయ్య, ఖాజమైనోద్దిన్, ఎస్టీవో రాజు, కోశాధికారిగా డాక్టర్ వేముల శేఖరయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఖదీర్, జాయింట్ […]
సారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో 23 కిలోల గంజాయిని పట్టుకున్నారు. పక్కా సమాచారంతో బిజినేపల్లి ఎస్సై వెంకటేశ్ తన సిబ్బందిపై శనివారం అజిత్బాషా ఇంటిపై దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. గతకొద్దిరోజులుగా గంజాయికి అలవాటుపడ్డ కొందరు యువకులు విచ్చలవిడిగా తాగుతూ ఎక్కడపడితే అక్కడ పడిపోతున్నారు. ఈ క్రమంలో కొంతకాలంగా వారిపై నిఘా ఉంచి గంజాయిని విక్రయిస్తున్న వారిని పట్టుకున్నామని ఎస్సై తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
సారథి, కొల్లాపూర్: ‘దండుపాలెం బ్యాచ్’ పేరుతో జుట్టు పెంచి సినిమాలో మాదిరిగా గంజాయి, మద్యం తాగి గ్యాంగ్ గా మారి కర్రలు, రాళ్లతో దాడులుచేస్తూ గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తున్న కొంతమంది యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై కృష్ణ ఓబుల్ రెడ్డి కథనం.. నాగర్ కర్నూల్ జిల్లా కోడేర్ మండలం రాజాపురంలో 8మంది యువకులు గ్రామంలో చీకటిపడగానే మద్యం సేవించి రోడ్లపై తిరుగుతూ, వాహనదారులు, బాటసారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ‘మేము దండుపాలెం బ్యాచ్ రా.. శవాలను లేపుతాం […]