Breaking News

MLC ELECTIONS

నిరుద్యోగుల ఆగ్రహంలో కొట్టుకుపోక తప్పదు

నిరుద్యోగుల ఆగ్రహంలో కొట్టుకుపోక తప్పదు

సారథి న్యూస్, హైదరాబాద్: నిరుద్యోగ యువత, ప్రభుత్వ ఉద్యోగులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులకు ఎన్నో హామీలు ఇచ్చి.. వాటిని నెరవేర్చకుండా ఉన్న ప్రజాప్రతినిధులు, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వారి ఆగ్రహంలో కొట్టుకపోకతప్పదని మహబూబ్​నగర్, రంగారెడ్డి, హైదరాబాద్​జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ముకురాల శ్రీహరి హెచ్చరించారు. ఆదివారం తెలంగాణ నిరుద్యోగుల ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని చిక్కడపల్లి సెంట్రల్​ లైబ్రరీ, ఆర్సీరెడ్డి స్టడీ సెంటర్, పలు స్టడీ సెంటర్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలువురు గ్రాడ్యుయేట్లను కలిసి ఓట్లను అభ్యర్థించారు. ఈ […]

Read More
ఏం చేశారని ఓటు వేయాలి

ఏం చేశారని ఓటు వేయాలి?

సారథి న్యూస్, శంషాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు ఇస్తే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని మంత్రి టి.హరీశ్​రావు డిమాండ్​ చేశారు. ఇంధనం, గ్యాస్ ధరలు అధికంగా పెంచుతూ పేదల నడ్డి విరుస్తుందని విమర్శించారు. శుక్రవారం శంషాబాద్ లోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజకవర్గ పట్టభద్రులుగా ఎమ్మెల్సీ సురభివాణి దేవిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. […]

Read More
పట్టభద్రులూ.. ఆలోచించి ఓటు వేయండి

పట్టభద్రులూ.. ఆలోచించి ఓటు వేయండి

సారథి న్యూస్, తాడ్వాయి: పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ అలియాస్ సీతక్క కోరారు. శుక్రవారం మండలంలోని మేడారం వనదేవతల సన్నిధిలో ములుగు జిల్లాలోని అన్ని మండలాల కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టభద్రులు కాంగ్రెస్​ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి యువతకు దిశా నిర్దేశం చేయాలన్నారు. ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని, న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం మేడారంలోని ఇంగ్లిష్ […]

Read More
ప్రశ్నించే గొంతుకను గెలిపించండి

ప్రశ్నించే గొంతుకను గెలిపించండి

సారథి న్యూస్, జడ్చర్ల: మహబూబ్​నగర్​, హైదరాబాద్​, రంగారెడ్డి గ్రాడ్యుయేట్​ ఇండిపెండెంట్​ ఎమ్మెల్సీ అభ్యర్థి ముకురాల శ్రీహరికి మద్దతుగా జడ్చర్ల, మహబూబ్​నగర్​లో ‘ఇంటింటికీ ప్రశ్నించే గొంతుక’ అనే కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి మహబూబ్​ నగర్ జిల్లాలో ప్రచారం చేశారు. పట్టభద్రులు, విద్యార్థులు, మేధావులు, వివిధ రంగాల ఉద్యోగులను కలిసి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. నిరంతరం ప్రజల కోసం ఉద్యమం చేసే పాలమూరు ముద్దుబిడ్డ పోరాట యోధుడు ముకురాల శ్రీహరిని శాసనమండలికి పంపించేందుకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని పలువురు ప్రకటించారు. […]

Read More
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో గురువారం భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నల్లగొండ, ఖమ్మం, వరంగల్​ బీజేపీ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం ఆమె ప్రభుత్వ జూనియర్ కాలేజీ, హైస్కూల్, హాస్పిటల్, తహసీల్దార్​, ఎంఈవో, ఎంపీడీవో కార్యాలయాలతో పాటు పోలీస్ స్టేషన్లను సందర్శించి ప్రచారం నిర్వహించారు. ఆమె వెంట వాజేడు మండల […]

Read More
ఏ ముఖంతో ఓట్లడుగుతున్నవ్!

ఏ ముఖంతో ఓట్లడుగుతున్నవ్​ !

యువతను మరోసారి మోసం చేసేందుకు కుట్ర ఎమ్మెల్సీ అభ్యర్థి ముకురాల శ్రీహరి సారథి న్యూస్, మహబూబ్​నగర్: నిరుద్యోగుల ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి ఏనాడూ మాట్లాడని వ్యక్తులు గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతున్నారని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్​నగర్​ స్థానం గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ అభ్యర్థి ముకురాల శ్రీహరి ప్రశ్నించారు. కల్లబొల్లి కబుర్లు చెప్పి మరోసారి నిరుద్యోగ యువతను మోసం చేసేందుకు వస్తున్నారని ధ్వజమెత్తారు. బుధవారం మహబూబ్​నగర్ ​జిల్లా జడ్చర్లలో వంచిత్ ​బహుజన​ అగాడీ పార్టీ, బహుజన, యువజన, […]

Read More
గురుకులాల పార్ట్​టీచర్లు, లెక్చరర్లకు న్యాయం చేయాలే

పార్ట్ టైమ్ ​టీచర్లు, లెక్చరర్లకు న్యాయం చేయాలే

గురుకులాల్లో పనిచేస్తున్న అందరికీ సమాన వేతనాలు ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ముకురాల శ్రీహరి డిమాండ్​ సారథి న్యూస్, నాగర్​కర్నూల్: మహబూబ్​నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ​పట్టభద్రుల నియోజకవర్గ స్థానం నుంచి పోటీచేస్తున్న ఇండిపెండెంట్ ​ఎమ్మెల్సీ అభ్యర్థి ముకురాల శ్రీహరి ఆదివారం రంగారెడ్డి, నాగర్​కర్నూల్​జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు. పలువురు గ్రాడ్యుయేట్లు, పార్టీ టైమ్​ లెక్చరర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, అడ్వకేట్లను కలిసి తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు. ఈ సందర్భంగా తెల్కపల్లి సాంఘిక సంక్షేమశాఖ గురుకుల బాలికల […]

Read More
ఎన్నికల డ్యూటీని జాగ్రత్తగా నిర్వర్తించాలే

ఎన్నికల డ్యూటీని జాగ్రత్తగా నిర్వర్తించాలే

సారథి న్యూస్, ములుగు: ఎమ్మెల్సీ ఎన్నికల డ్యూటీని తమకు కేటాయించిన అధికారులు, సిబ్బంది జాగ్రత్తగా నిర్వర్తించాలని జిల్లా రెవెన్యూ అధికారి రమాదేవి సూచించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. విధుల పట్ల ఏవైనా అనుమానాలు తలెత్తితే నివృత్తి చేసుకోవాలని సూచించారు. మార్చి 2న పీవో, ఏపీవోలకు మొదటి విడత, 9న రెండో విడత శిక్షణ ఉంటుందని తెలిపారు. ఎన్నికల పోలింగ్ లో […]

Read More