Breaking News

medak

కష్టకాలంలోనూ రైతులను ఆదుకున్నాం

కష్టకాలంలోనూ రైతులను ఆదుకున్నాం

సారథి న్యూస్, మెదక్: ప్రజాసంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తున్నా రాష్ట్రంలో రైతులకు రైతుబంధు డబ్బులను వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రమైన మెదక్ కలెక్టరేట్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఒక వైపు అభివృద్ది, మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు. రాష్ట్రంలో 24 […]

Read More

చిన్నశంకరంపేటలో రెండు కేసులు

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట మండలం చందాపూర్ గ్రామంలో బుధవారం రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్​ శ్రావణి తెలిపారు. మొత్తం 11 మందికి టెస్టులు నిర్వహించగా వారిలో ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మాస్కులు ధరించి బయటకు రావాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించి టెస్టులు చేసుకోవాలన్నారు.

Read More
మత్స్యకారులను ఆదుకుంటాం

మత్స్యకారులను ఆదుకుంటాం

సారథి న్యూస్, రామాయంపేట: మత్స్యకారులను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఎంతో కృషిచేస్తోందని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మెదక్​ జిల్లా రామాపంపేట మండలం డీ. ధర్మారంలోని ఊరచెరువులో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద 1.76కోట్ల చేపపిల్లలను వదిలారు. మత్స్యకారులు దళారులను నమ్మకుండా చేపలను సొంతంగా మార్కెటింగ్​ చేసుకునేలా అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం గ్రామంలో రూ.16 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనంతో పాటు డంప్​యార్డు, వైకుంఠధామాలను […]

Read More
సీఎం రిలీఫ్​ఫండ్​ చెక్కుల పంపిణీ

సీఎం రిలీఫ్​ఫండ్​ చెక్కుల పంపిణీ

సారథిన్యూస్, చిన్నశంకరంపేట: మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు సోమవారం టీఆర్​ఎస్​ పార్టీ మండల అధ్యక్షుడు పట్లోరి రాజు సీఎం రిలీఫ్​ఫండ్​ చెక్కులను పంపిణీ చేశారు. 32 మంది లబ్ధిదారులకు రూ. 8 లక్షల 45 వేల చెక్కులను అందజేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు.. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన సర్పంచులు, నాయకులు రమేశ్​గౌడ్, బండారు స్వామి తదితరులు పాల్గొన్నారు.

Read More

చిన్నశంకరంపేటలో ఇద్దరికి కరోనా

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. స్థానిక పీహెచ్​సీలో సోమవారం 17 మందికి కరోనా పరీక్షలు చేశారు. వారిలో మడూర్, చందాపూర్ గ్రామాలకు చెందిన ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణి తెలిపారు. నేటితో మండలంలో 13 మందికి పాజిటివ్ రాగా నలుగురు రికవరీ అయ్యారని చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు.

Read More
‘రైతువేదిక’లను వేగవంతం చేయాలి

‘రైతువేదిక’లను వేగవంతం చేయాలి

సారథి న్యూస్, రామాయంపేట: రైతువేదిక పనులను వేగవంతం చేయాలని మెదక్ జిల్లా అడిషనల్ ​కలెక్టర్​నగేష్ కాంట్రాక్టర్లకు సూచించారు. శనివారం నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామంలో రైతు వేదికలను నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు వేగవంతంగా జరగాలని, నాణ్యతగా ఉండాలని సూచించారు. ఆయన వెంట డీఏవో పరశురాంనాయక్, ఏవో సతీశ్​ ఉన్నారు.

Read More
రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్​జిల్లా నిజాంపేట మండలంలోని చల్మెడ గ్రామంలో శనివారం నిజాంపేట ఎంపీపీ సిద్ధరాములు పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. ఈ మేరకు గ్రామానికి చెందిన బొమ్మన భిక్షపతి రూ.25వేలు, వడ్ల శ్రీనివాసులు రూ.44,వేలు, భూడాల దుర్గయ్య కు రూ.48వేల చొప్పున విలువైన చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నంద్యాల బాల్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల మహేష్, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్, ఆకుల లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ నాయకులు […]

Read More
కరోనాకు భయపడకండి

కరోనాకు భయపడకండి

సారథి న్యూస్​, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆస్పత్రిలో కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్ ను తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్​రావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా గురించి భయపడకండి.. మానసికంగా కృంగిపోవద్దు. ధైర్యంగా కాపాడాలని సూచించారు. కరోనా వచ్చినవారు ఎవరికీ చెప్పకుండా సొంత వైద్యం చేసుకోవద్దని డాక్టర్ ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ చైర్మన్ […]

Read More