సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా కొండా సుగుణ నియమితులయ్యారు. శుక్రవారం ఆమె దేవరకద్రలోని శ్రీనివాస గార్డెన్ ఫంక్షన్హాల్లో ప్రమాణం చేయనున్నారు. కాగా, ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్, ఎస్.నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
సారథిన్యూస్, గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా రామేశ్వరమ్మ ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం రామేశ్వరమ్మకు రాష్ట్ర ప్రభుత్వం నియామక ఉత్తర్వులు అందజేసింది. ఈ సందర్భంగా ఆమెను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అభినందించారు. రామేశ్వరమ్మ నేతృత్వంలో మార్కెట్‌కమిటీ మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ఆకాంక్షించారు. కాగా తనపై నమ్మకం ఉంచి పదవి కట్టబెట్టినందుకు రాష్ట్ర మంత్రులు కేటీఆర్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి రామేశ్వరమ్మ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో జరిగే వారంతపు సంతలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. కరోనా వేళ సంతకు ప్రజల రాకపోకలు కొంత మేర తగ్గించినప్పటికీ కూరగాయలు, తృణధాన్యాలు, దుస్తులు, మసాలాలు, చిన్నచిన్న వస్తువుల కోసం ఈ సంతకే వస్తుంటారు. కానీ ఇక్కడ కనీసవసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంత సమీపంలో పైకప్పులేని డ్రైనేజీ ఉండటంతో దుర్వాసన వెదజల్లుతున్నది. పంచాయతీ సిబ్బంది మార్కెట్ ఫీజు వసూలు చేస్తున్నప్పటి.. పట్టించుకోవడం లేదు. […]
చామదుంపల్లో ఎన్ని పోషకాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యం కలగకమానదు. దుంపల్లో కొన్నింటిని పచ్చిగానే తినొచ్చు.. కొన్నింటిని వండుకొని తినగలం. చామ దుంపల్ని వండుకొని మాత్రమే తినగలం. ఇవి జిగురుగా ఉంటాయని చాలా మంది వీటిని తినేందుకు ఇష్టపడరు. నిజానికి వీటిలో చాలా పోషకాలు ఉంటాయి. చామ దుంపల్ని ఉడికించి, వేయించి, కాల్చుకుని తినొచ్చు. మాంసానికి బదులుగా వీటిని తింటారని తెలుసా. మంచి రుచినీ, పోషకాలనీ ఇవి ఇస్తాయి. 100 గ్రాముల చేమదుంపల్లో దాదాపు 120 కేలరీల శక్తి ఉంటుంది. […]