సారథి న్యూస్, ఖమ్మం: రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్లలో ఉన్న పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని, ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని డీజీపీ ఎం.మహేందర్రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం పోలీసు కమిషనర్లు, ఆయా జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్ కేసులను సమీక్షించడం ద్వారా కేసులు సంఖ్య తగ్గించేలా కృషిచేయాలన్నారు. నిందితులకు శిక్షపడేలా కృషిచేసిన ఎస్పీలు, కమిషనర్లను డీజీపీ అభినందించారు. లాక్ డౌన్ వల్ల సైబర్ క్రైమ్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా(కోవిడ్–19) వైరస్ బారిన పడుతున్న పోలీసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ మరింత అప్రమత్తమైంది. అనారోగ్యంతో బాధపడుతున్న పోలీసు అధికారులు, సిబ్బంది విశ్రాంతి తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసులు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారని, తద్వారా కొందరు పోలీసులు వైరస్ బారిన పడ్డారని వెల్లడించారు. డ్యూటీలో ఉన్న పోలీసులు అధికారులు, సిబ్బంది కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే సెలవు పెట్టాలని […]