Breaking News

MAHABUBNAGAR

కోయిల్​సాగర్​నుంచి నీటివిడుదల

కోయిల్​సాగర్ ​నుంచి నీటి పరవళ్లు

సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్​నగర్ ​జిల్లాలోని భారీ సాగునీటి పారుదల ప్రాజెక్టు కోయిల్ సాగర్ ఐదు షట్టర్లను ఆదివారం తెరిచి అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. ఇటీవల కురుస్తున్న భారీవర్షాలకు ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతోంది. పెద్దఎత్తున ప్రవాహం వచ్చి చేరుతుండడంతో ముందు జాగ్రత్త చర్యల్లో గేట్లు ఎత్తివేశారు. ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్థ్యం 32.5 ఫీట్లు ఉండగా, ప్రస్తుతం 32 ఫీట్లకు చేరింది. ప్రాజెక్టుకు కోయిలకొండ, అంకిళ్ల వాగుల నుంచి పెద్దఎత్తున వరద వచ్చి […]

Read More
కోయిల్ సాగర్​లో 31 ఫీట్ల నీటిమట్టం

కోయిల్ సాగర్​లో 31 ఫీట్ల నీటిమట్టం

సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్​నగర్ జిల్లాలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టు కోయిల్ సాగర్ కు శనివారం పెద్దఎత్తున వరద నీరు వచ్చిచేరింది. ప్రాజెక్టు మొత్తం నీటినిల్వ సామర్థ్యం 32.5 ఫీట్లు. అయితే ప్రాజెక్టులో 31 ఫీట్లకు నీటి నిల్వ చేరింది. దీంతో ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. జూరాల నుంచి కోయిల్ సాగర్ కు ఒక మోటారు ద్వారా కృష్ణాజలాలను తరలిస్తున్నారు. అలాగే ఎగువ ప్రాంతాల్లో భారీవర్షాలు కురవడంతో కోయిలకొండ, అంకిళ్ల వాగుల నుంచి పెద్దఎత్తున వర్షపునీరు ప్రాజెక్టులోకి […]

Read More
పత్తిరైతు కన్నీరు

పత్తిరైతు కన్నీరు

సారథి న్యూస్, దేవరకద్ర: ఈ ఏడాది కాలం కలిసొచ్చిందనుకుంటే ముసురు వర్షం రైతులను కన్నీరు పెట్టిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర మండలంలోని పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వానలకు పత్తి పొలాల్లోకి విపరీతంగా నీరు వచ్చిచేరింది. దీంతో పంటంతా ఊట ఎక్కుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. దేవరకద్ర మండలంలో ఈ ఏడాది సుమారు 11వేల ఎకరాల్లో వరినాట్లు వేశారు. మండలంలోని గోపనపల్లి, పుట్టపల్లి, కౌకుంట్ల, రాజోలి, వెంకటగిరి, వెంకంపల్లి […]

Read More

అనారోగ్యంతో జర్నలిస్టు​ మృతి

సారథి న్యూస్​, కర్నూలు: వివిధ పత్రికల్లో సబ్​ఎడిటర్​గా పనిచేసిన అక్కలదేవి రాజా(30) శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందారు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్​తో బాధపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలుకు చెందిన రాజా.. ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ దినపత్రికల్లో సబ్​ఎడిటర్​గా పనిచేశారు. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో చాలా సంవత్సరాలు పనిచేయడంతో ఇక్కడి జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలతో రాజాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన మృతికి పలువురు జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నేతలు సంతాపం తెలిపారు. అందరినీ నవ్విస్తూ, నవ్వుతూ ఉండే రాజా తమ […]

Read More

బండరపల్లి చెక్​డ్యాంకు జలకళ

సారథి న్యూస్​, దేవరకద్ర: మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర మండలం గూరకొండ సమీపంలోని బండర్​పల్లి చెక్​డ్యాం అలుగు పారుతోంది. బండర్​పల్లి వంతెనను గతేడాది మంత్రి టి.హరీశ్​రావు చొరవతో చెక్​డ్యాంగా నిర్మించారు. కాగా, కొన్ని రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో పెద్దఎత్తున నీరు చేరి అలుగు పారుతోంది. చెక్ డ్యాం నిండడంతో పరిసర గ్రామల్లో భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెక్​డ్యాంకు నిధులు మంజూరు చేసిన మంత్రి టి.హరీశ్​రావు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Read More
నిండుకుండలా కోయిల్ సాగర్

నిండుకుండలా కోయిల్ సాగర్

సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్​నగర్ ​జిల్లాలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టు కోయిల్ సాగర్ నిండుకుండలా మారింది.. భారీవర్షాలకు జలకళ సంతరించుకుంది. ప్రస్తుతం నీటిమట్టం 30 ఫీట్లకు చేరింది. కోయిల్​సాగర్ ప్రాజెక్టును 1954 లో నిర్మించారు. అప్పటి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి కేఎం ఖర్జూ ప్రాజెక్టును ప్రారంభించి మొట్టమొదటిసారిగా ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టును అప్పట్లో కేవలం వర్షాధారం ప్రాతిపదికగానే 12వేల ఎకరాలకు సాగునీటిని అందించేలా నిర్మించారు. ఆ తర్వాత ఎత్తిపోతల పథకంగా మార్చారు. ఇక్కడి నుంచి […]

Read More
మంత్రి.. నేనున్నానని

మంత్రి.. నేనున్నానని

సారథి న్యూస్, మహబూబ్​నగర్: మహబూబ్​నగర్ కు చెందిన చెరుకుపల్లి రామలింగయ్య కరోనాతో మృతిచెందారు. దహన నమస్కారాలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు ఎవరూ ముందుకురాలేదు. నేనున్నానని.. మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్ ​పీపీఈ కిట్ ధరించి సోమవారం అతని అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా వైరస్ తో మరణిస్తే అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం హేయమైనా చర్యగా అభివర్ణించారు. కరోనా ప్రబలిన నాటి నుంచి మృతుల అంత్యక్రియలు నిర్వహిస్తున్న తీరు మానవీయ విలువలను మంటగలిపేలా ఉందని ఆందోళన […]

Read More
‘పాలమూరు’ పనుల పరిశీలన

‘పాలమూరు’ పనుల పరిశీలన

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్ నియోజవర్గం పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్ ​వద్ద జరుగుతున్న పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను శుక్రవారం మంత్రులు వి.శ్రీనివాస్​గౌడ్, ఎస్.నిరంజన్​రెడ్డి, నాగర్​కర్నూల్​ ఎంపీ పి.రాములు, మహబూబ్​నగర్​ఎంపీ మన్నె శ్రీనివాస్​రెడ్డి తదితరుల బృందం​ పరిశీలించింది. పనులను వేగవంతంగా పూర్తిచేయాలని, నాణ్యతగా ఉండాలని సూచించింది. బృందంలో ప్రభుత్వ విప్​ గువ్వల బాలరాజు, జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్ యాదవ్, అంజయ్య […]

Read More