బిడ్డను నడుముకు కట్టుకుని తల్లి ఆత్మహత్య మహబూబ్‌నగర్‌జిల్లా మిడ్జిల్‌లో ఘటన సామాజిక సారథి, మిడ్జిల్: ఆ తల్లికి ఏ ఆపద వచ్చిందో తెలియదు కానీ తాను లేని ఈ లోకంలో తన కూతురును కూడా ఉండొద్దని భావించినట్టుంది. 9నెలల కుమార్తెను నడుముకు కట్టుకొని చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్‌నగర్‌జిల్లా మిడ్జిల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. తిమ్మాజీపేట మండలం గుమ్మకొండ గ్రామానికి చెందిన సరిత(20)కు మిడ్జిల్ గ్రామానికి చెందిన శ్రీశైలంతో రెండేళ్ల క్రితం వివాహమైంది. వారికి […]
సామాజిక సారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా కూచకుళ్ల దామోదర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. తన తనయుడు డాక్టర్ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డితో కలిసి ఆయన శుక్రవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావును హైదరాబాద్ లో నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన దామోదర్ రెడ్డికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన విజయం కోసం పనిచేసిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, స్థానిక సంస్థల ప్రతినిధుల కృషిని […]
సామాజిక సారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి గురువారం సాయంత్రం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావును హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడంతో మంత్రులు వారికి బొకే అందజేసి, శాలువా కప్పి సన్మానించారు. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్సీల ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, జెడ్పీచైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీలు, […]
సామాజిక సారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది. మహబూబ్ నగర్ జిల్లా నుంచి రెండు స్థానాలకు గాను మొత్తం 10మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వారిలో ఆరుగురి నామినేషన్లను వివిధ కారణాలతో ఎన్నికల పరిశీలన అధికారులు తిరస్కరించారు. టీఆర్ఎస్ అభ్యర్థులు కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డితో పాటు మరో ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ […]
సామాజిక సారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగు నామినేషన్లు ఆమోదం పొందాయి. ఆరు తిరస్కరణకు గురయ్యాయని మహబూబ్‌నగర్‌జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ఎస్.వెంకట్రావు తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుల ఎన్నికల్లో భాగంగా బుధవారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్ లో ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు ఈ.శ్రీధర్, పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్లు, ప్రతిపాదకుల సమక్షంలో నామినేషన్లను పరిశీలించారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి రెండు స్థానాలకు […]
సామాజిక సారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి/ కల్వకుర్తి: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలను మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు కు అందజేశారు. ఆయన వెంట మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి వెళ్లి స్వయంగా నామినేషన్ పత్రాలను కలెక్టర్‌కు అందజేశారు. మరో అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా నామినేషన్ వేశారు. ఆయన వెంట […]
సారథి, మహబూబ్ నగర్: రాష్ట్రంలో కరోన మహ్మమారి రోజు రోజుకు విజృంభిస్తుండటంతో ఇంటి నుంచి అడుగు బయటపెట్టాలంటే మాస్కు తప్పనిసరిగా మారింది. కొంతమంది ఎన్ 95 మాస్కులు ధరిస్తే మరికొందరు మాత్రం వాషబుల్ క్లాత్ మాస్కులను ధరిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం చిన్న మునుగల్ చేడ్ గ్రామానికి చెందిన ఓ తాత గిజిగాడి పిట్టగూడును మాస్కుగా ధరించి పొలం వద్ద నుంచి నేరుగా పింఛన్ తీసుకునేందుకు వచ్చాడు. దీంతో అక్కడున్న స్థానికులు పిట్టగూడును మాస్కుగా […]
జై భీమ్ యూత్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ముకురాల శ్రీహరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు సారథి న్యూస్, హైదరాబాద్: జైభీమ్ యూత్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ముకురాల శ్రీహరి మంగళవారం మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల నియోజకవర్గ స్థానానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు, నిరుద్యోగులు, పార్ట్ టైం, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమేనని […]