Breaking News

KAVITHA

నాగర్​ కర్నూల్​ లో ఎమ్మెల్సీ కవిత ఫ్లెక్సీల చించివేత

నాగర్​ కర్నూల్​ లో ‘ఎమ్మెల్సీ కవిత’ ఫ్లెక్సీల చించివేత

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్​ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి సంబంధించి ఎంజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 220 జంటలకు ఉచితంగా సామూహిక వివాహ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టారు. ఆదివారం ఉదయం నాగర్ కర్నూల్ లోని జిల్లా పరిషత్ పాఠశాలలో కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు. ఆమెకు స్వాగతం చెబుతూ నియోజవర్గవ్యాప్తంగా విస్తృతస్థాయిలో ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. కానీ శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు బిజినేపల్లి నుంచి పాలెం మధ్యలో మూడు ఫ్లెక్సీలను చించివేశారు. […]

Read More
తెలంగాణ జాగృతిలో పలువురి చేరిక

తెలంగాణ జాగృతిలో పలువురి చేరిక

సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయలను పదిమందికి చేరవేయడమే తమ ముఖ్య ఉద్దేశమని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షురాలు పట్లోళ్ల మల్లిక అశోక్ అన్నారు.మెదక్​ జిల్లా నిజాంపేట మండలకేంద్రంలోని వ్యవసాయ సబ్ మార్కెట్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు తెలంగాణ జాగృతిలో చేరారు. తెలంగాణ పండుగలను ప్రపంచం నలుమూలలకు తెలియజేయడంలో మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కవిత ఎనలేని కృషిచేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కన్వీనర్ శేఖర్, నిజాంపేట జడ్పీటీసీ పంజా […]

Read More
వైభవంగా గోరెటి వెంకన్న కూతురు పెళ్లి

వైభవంగా గోరెటి వెంకన్న కూతురు పెళ్లి

సారథి న్యూస్​, హైదరాబాద్​: హైదరాబాద్​లో శుక్రవారం జరిగిన ప్రజావాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న కూతురు వివాహానికి సీఎం కె.చంద్రశేఖర్​రావు ముఖ్య​అతిథిగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి, మున్సిపల్​, ఐటీశాఖ మంత్రి కె. తారక రామారావు, మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి, నాగర్​కర్నూల్​ ఎంపీ పోతుగంటి రాములు, ఎల్​బీ నగర్​ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్​రెడ్డి, నిజామాబాద్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ఎంపీ మందా జగన్నాథం తదితరులు హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Read More

బతుకమ్మ పండుగపై క్లారిటీ.. తేదీలు ఇవే!

సారథిన్యూస్​, హైదరాబాద్​: బతుకమ్మ సంబురాలు ఎప్పుడు జరుపుకోవాలనే దానిపై క్లారిటీ వచ్చేసింది. ప్రతి ఏడాది పెద్దల అమావాస్య రోజున ఈ పండుగను ప్రారంభిస్తారు. అయితే ఈ ఏడాది అధిక ఆశ్వయుజ మాసం రావడంతో బతుకమ్మ పండుగ ఎప్పుడు జరుపుకోవాలన్నదానిపై సందిగ్ధం నెలకొన్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ బ్రాహ్మణ సేవాసమితి బతుకమ్మ పండుగపై ఓ క్లారిటీ ఇచ్చింది. అక్టోబర్ 17న ఎంగిలిపూల బతుకమ్మ జరుపుకోవాలని దానికోసం ఏర్పాట్లు చేయాలని బ్రాహ్మణ సేవా సమితి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అక్టోబర్ […]

Read More