బెంగళూరు: కర్ణాటక సీఎం యడ్యూరప్ప హోంఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. ఇటీవల ఆయన కార్యాలయంలోని పలువురు సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘నా కార్యాలయంలోని కొంతమందికి కరోనా పాజిటివ్ రావడంతో నేను హోం ఐసోలేషన్లోకి వెళుతున్నాను. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని ఆయన పేర్కొన్నారు. ఇక నుంచి తాను అధికారిక నివాసం ‘కావేరి’ నుంచి పనిచేస్తానని… వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు తగిన సూచనలు […]
ప్రముఖ సినీనటి, కర్ణాటకలోని మాండ్య ఎంపీ సుమలతకు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఫేస్బుక్లో పోస్టుచేశారు. ‘శనివారం నుంచి తలనొప్పి, గొంతునొప్పితో బాధపడుతున్నాను. దీంతో అనుమానం వచ్చి కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం హోంక్వారంటైన్లోనే ఉన్నాను. డాక్టర్ల సూచనలతో మందులు వాడుతున్నాను. త్వరలోనే కోలుకుంటానన్న నమ్మకం ఉంది’ అని ఆమె పేర్కొన్నారు. కరోనా సోకినవారెవరూ ఆందోళన చెందొద్దని.. ధైర్యంగా ఉండి మందులు వాడాలని సూచించారు.
కరోనా.. క్వారంటైన్ పేరు చెప్పగానే ఉలిక్కిపడే పరిస్థితి వచ్చింది. కరోనా లక్షణాలు కనిపించినా, ఎవరైనా దూర ప్రయాణాలు చేసి వచ్చినా.. అధికారులు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. ఓ ఊరులో గొర్రెలు, మేకల కోసం కూడా క్వారంటైన్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. కర్ణాటకలోని తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకాలోని గొడెకెరె గ్రామ పంచాయతీ పరిధిలోని గొల్లరహట్టి గ్రామంలో ఓ వ్యక్తికి చెందిన కొన్ని గొర్రెలు, మేకలు కొన్ని రోజులుగా శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నాయి. జలుబు, జ్వరం […]
బెంగళూరు: పరీక్షలంటే పెన్ను, అట్ట, పెన్సిల్ పట్టుకుని వెళ్తాం. కానీ ఈ కరోనా కాలంలో శానిటైజర్, మాస్కు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. కర్ణాటకలో గురువారం టెన్త్ ఎగ్జామ్స్ప్రారంభమయ్యాయి. ఏ స్టూడెంట్ చేతిలో చూసినా శానిటైజర్, మాస్క్‌లే కనిపించాయి. సోషల్ డిస్టెంసింగ్ పాటిస్తూ, మాస్కులుపెట్టుకుని స్క్రీనింగ్ చేయించుకుంటూ కనిపించారు. రాష్ట్రంలో మొత్తం 8లక్షల మంది స్టూడెంట్స్‌కు కర్ణాటక ప్రభుత్వం ఎగ్జామ్స్నిర్వహిస్తోంది. కరోనా నేపథ్యంలో స్టూడెంట్స్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంది. ‘పదో తరగతి అనేది విద్యార్థుల […]
బెంగళూర్ : కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం సృష్టిస్తున్నది. సామాన్యులు, ప్రభుత్వాధికారులు, మంత్రులను వదలడం లేదు. తాజాగా కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి కే సుధాకర్ భార్య, ఆయన కుమార్తెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇటీవలే సుధాకర్ తండ్రికి పాజిటివ్ రావడంతో ఆయన కుటుంబసభ్యులకు కరోనా పరీక్షలు చేశారు. తమ కుటుంబ సభ్యులకు నిర్వహించిన కోవిడ్-19 టెస్ట్ రిపోర్టులు వచ్చాయని, తన భార్య కుమార్తెకు పాజిటివ్ ఫలితాలు వచ్చాయని మంత్రి ట్వీట్ చేశారు. ప్రస్తుతం వారిద్దరూ ఆస్పత్రిలో […]
న్యూఢిల్లీ: జట్టులో చోటు దక్కకపోవడం, సరైన ఫామ్‌లో లేకపోవడంతో… దాదాపు రెండు నెలలు కుంగుబాటుకు లోనయ్యానని వెటరన్ బ్యాట్స్‌మెన్ రాబిన్ ఉతప్ప అన్నాడు. ఓ దశలో ఆత్మహత్య కూడా చేసుకుందామన్న ఆలోచనలు కూడా వచ్చాయన్నాడు. ‘నా కెరీర్లో 2009 నుంచి 2011 వరకు రెండేళ్లు గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నా. ఎప్పుడూ కుంగుబాటుతో బాధపడేవాడిని. క్రికెట్ గురించి ఆలోచించిన సందర్భాలు లేనేలేవు. ఎప్పుడూ ఆత్మహత్య ఆలోచనలే. నేను వెళ్తున్న దారి సరైందో కాదో కూడా తెలుసుకోలేని పరిస్థితి. ఓ […]
పన్నెండో శతాబ్దంలో కర్ణాటక రాష్ట్రంలో జన్మించిన బసవేశ్వరుడు విశ్వగురువుగా పేరొందారు. కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలోని బాగేవారి వీరి జన్మస్థలం. బసవేశ్వరుడు 1134 లో వైశాఖ శుద్ధ తదియ రోజున(అక్షయ తృతీయ) అనగా సరిగ్గా 880 ఏళ్లం క్రితం జన్మించారు. తల్లి మాదాంబ, తండ్రి మాదిరాజు ద్వారా చిన్న వయసులోనే బసవేశ్వరుడు శైవపురాణ గాథలను అవగతం చేసుకున్నారు. కుల, వర్ణ, లింగ వివక్షలు లేని సమసమాజ స్థాపనకు ఆనాడే అపారమైన కృషిచేసిన సంఘసంస్కర్త. సనాతన సంప్రదాయ ఆచరణలో నెలకొన్న […]