సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్రావుపేటలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం డాక్టర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగానే గుండి పీహెచ్‌సీలోని ఇద్దరు డాక్టర్లను సన్మానించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దురుశెట్టి మల్లేశం, సెక్రటరీ కోడీమ్యాల వేణుగోపాల్, కోశాధికారి రాంపల్లి శ్రీనివాస్, కోడీమ్యాల వెంకట్ రమణ, కర్ర శ్యాంసుందర్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.
సారథి, రామడుగు: నాలుగో విడత హరితహారంపై మంగళవారం కరీంనగర్ జిల్లా రామడుగు ఎంపీడీవో ఆఫీసులో ఎంపీపీ కలిగేటి కవిత అధ్యక్షతన నిర్వహించారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆమె కోరారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని యజ్ఞంలా చేపట్టారని అన్నారు. హరితహారాన్ని చాలెంజ్‌గా తీసుకోవాలని సూచించారు. జడ్పీటీసీ సభ్యురాలు మారుకొండ లక్ష్మీ, ఏఎంసీ చైర్మన్ గంటల వెంకటరెడ్డి, ఎంపీడీవో ఎన్నర్ మల్హోత్ర, ఎంపీవో సతీష్ కుమార్, గుండి గోపాల్రావుపేట ప్రాథమిక ఆరోగ్య […]
సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం శ్రీరాములపల్లి గ్రామంలో శుక్రవారం మండల అధికారులు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాత్రి పలు వార్డుల్లో కలియ తిరిగి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. పలు అంశాలపై అవగాహన కల్పించారు. స్థానికులు పలు ఇబ్బందులను అధికారుల దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ జీవన్, ఎంపీడీవో మల్హోత్రా, ఎంపీవో సతీష్, కార్యదర్శి శ్రీకాంత్ రావు, ఎంపీటీసీ సభ్యుడు మోడీ రవి, ఏఎన్ఎం, వైద్యసిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
సారథి, చొప్పదండి: పల్లెలు ప్రగతి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని కరీంనగర్జిల్లా చొప్పదండి ఎంపీపీ చిలుక రవీందర్ అన్నారు. గురువారం చొప్పదండి మండలంలోని రాగంపేట గ్రామంలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం వరకు పల్లెనిద్ర పేరున పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తున్న పంచాయతీల ప్రగతి పర్యవేక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మొక్కల పెంపకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని తెలిపారు. ఖాళీస్థలాల్లో విరివిగా పెంచాలని సూచించారు. రాగంపేటలో ఉపాధి హామీ నిధులతో నిర్మిస్తున్న వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్, డంపింగ్ […]
సారథి, వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ రాజారాజేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు రాకపోకలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగానే మంగళవారం స్వామివారిని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. ఆయనకు అర్చకులు ఘనస్వాగతం పలికారు. తదనంతరం వారికి స్వామివారి అభిషేకం లడ్డూ ప్రసాదం అందజేశారు. పొన్నం వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో జగిత్యాల ప్రధాన రహదారిపై హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, డీఆర్డీవో లంకల శ్రీలతరెడ్డి తో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు హరితహారం కార్యక్రమం పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంపీఓ, ఎంపీటీసీ, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.
సారథి, రామడుగు: కరోనా మహమ్మారి పేదల బతుకులను ఛిద్రం చేసింది. ఈ సమయంలో బడుగు జీవులకు ఆపన్నహస్తం అందిస్తూ ఆసరాగా నిలుస్తున్నారు ఎందరో మహానుభావులు. ఆదరణ సేవాసమితి, సర్వ్ టూ సొసైటీ సంయుక్తంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తీర్మాలపూర్ గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులకు మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, బియ్యం అందజేశారు. వారి చదువు పూర్తయినందున ఏదైనా ఉద్యోగ అవకాశం ఇప్పించే ప్రయత్నం చేస్తామని భరోసా ఇచ్చారు. అలాగే కొక్కెరకుంట గ్రామంలో […]
సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామంలో రూ.ఐదులక్షల సీడీపీ నిధులతో నిర్మించనున్న గొల్ల యాదవ కురుమ సంఘం భవనం, రూ.43 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీరప్ప ఆలయం పనులకు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో దండిగా నిధులు ఖర్చుచేస్తున్నామని చెప్పారు. కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమానికి ఎలాంటి లోటు రానివ్వలేదన్నారు. కులసంఘాల భవనాలు, ఆలయాలు, మురికి కాల్వలు, సీసీరోడ్లు, హైమాస్ట్ లైట్లు.. […]