చెన్నై: ప్రముఖగాయకుడు, గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉన్నదని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు తాజాగా హెల్త్‌బులెటిన్‌ను విడుదల చేశాయి. దీంతో ప్రస్తుతం ఎంజీఎం వద్ద తీవ్ర ఉద్విగ్న వాతావరణం నెలకొని ఉన్నది. గురువారం సాయంత్రం నుంచి ఎస్పీ బాలూ ఆరోగ్యం తీవ్రంగా విషమించిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో తెలుగు ప్రజలు, బాలూ అభిమానులు తీవ్ర ఆందోళనగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎంజీఎం దవాఖాన పరిసరాలు మాత్రం కోలాహలంగా మారాయి. ఎంజీఎంకు వెళ్లే దారులన్నీ బాలూ […]
కోలీవుడ్‌లో కళామతల్లి ముద్దు బిడ్డ కమల్‌హాసన్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో సూపర్ స్టార్ రజినీకాంత్‌తో సినిమా తీయనున్నారని.. ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్నారన్న వార్త చాలా రోజుల క్రితం హల్ చల్ చేసింది. అయితే రజినీ ‘దర్బార్’ చిత్రం తర్వాత ‘వీరం, వేదాళం, వివేకం, విశ్వాసం’ లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన శివ దర్శకత్వంలో ‘అన్నాత్తా’ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో రజినీ కాంత్ సరసన హీరోయన్స్ […]
భారతీరాజా దర్శకత్వంలో దిగ్గజ నటులు కమల్‌హాసన్, రజినీకాంత్ అందాల తార శ్రీదేవి నటించి సూపర్‌హిట్ సాధించిన ‘పదినారు వయదినిలే’ చిత్రాన్ని డిజిటలైజ్‌చేసి తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి ‘నీ కోసం నిరీక్షణ’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు సుప్రీమ్ ఆల్మైటీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ వెల్లడించింది. తమిళనాడులో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం నాలుగు రాష్ట్రీయపురస్కరాలను సొంతం చేసుకున్నది. ఉత్తమ నటుడిగా కమల్ హాసన్, ఉత్తమ దర్శకుడిగా భారతీరాజా, ఉత్తమ సంగీత దర్శకుడిగా ఇళయరాజా, ఉత్తమ […]