సారథి న్యూస్, పెద్దశంకరంపేట: సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మి పథకం నిరుపేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన పెద్దశంకరంపేట మండలం బుజరంపల్లి, గోపని వెంకటాపూర్, టెంకటి గ్రామాలకు చెందిన 15 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ పేదప్రజల పక్షానే ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీసులో పది మంది లబ్ధిదారులకు రూ.10,01,160 విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్గెటి కవిత, వైస్ ఎంపీపీ పురేళ్ల గోపాల్, జడ్పీటీసీ మారుకొండ లక్ష్మి, స్థానిక సర్పంచ్ పంజాల ప్రమీల, సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వర్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరెడ్డి, పలు గ్రామా సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.