సారథిన్యూస్, హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి అబ్ధుల్ కలాం ఆశయాలు కొనసాగిద్దామని తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర్‌రాజన్ పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తిని యువత అలవర్చుకోవాలని సూచించారు. కలాం ఐదో వర్ధంతి సందర్భంగా సోమవారం రాజ్‌భవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం తమిళనాడులోని కలాం బంధువులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
సారథిన్యూస్, రామడుగు: తమకు ఇష్టమైన రాజకీయ నాయకుల పుట్టినరోజులకు పోటీపడి ఉత్సవాలు చేసే నాయకులు.. మహనీయుడైన అబ్దుల్ కలాం వర్ధంతిని మరిచారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పలుచోట్ల కలాంకు వివిధ పార్టీల నాయకులు నివాళి అర్పించారు. కానీ కరీంనగర్ జిల్లా రామడుగులో మాత్రం నేతలు కలాంను మరిచిపోయారు. ఒక పువ్వు పెట్టి నివాళి అర్పించే సమయం కూడా వారికి లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నాయకులను ప్రసన్నం చేసుకోవడం తగ్గించి.. దేశానికి సేవచేసిన మహనీయులను […]