ఢిల్లీ/ఖమ్మం: తెలంగాణ మాదిరిగానే అన్నిరంగాల్లో జమ్ముకాశ్మీర్ లో కూడా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని టీఆర్ఎస్ లోకసభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆకాంక్షించారు. జమ్ముకాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టసవరణ పై శనివారం లోక్ సభలో జరిగిన చర్చలో ఎంపీ నామా పాల్గొన్నారు. చట్టంలో తీసుకొచ్చిన రెండు సవరణలు అవసరమేనని అన్నారు. జమ్మూకాశ్మీర్ బిల్లు 2019లో లోక్ సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా టీఆర్ఎస్ పూర్తిమద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పుడు కూడా తాజాగా తీసుకొచ్చిన రెండు సవరణలకు […]
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఓ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ సూసైడ్ చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇందర్‌పాల్ సింగ్(53)వైమానిక దళంలో వారెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. తన సర్వీస్ పిస్టల్‌తో తలపై కాల్చుకున్నాడు. వెంటనే సహచరులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే చనిపోయాడని డాక్టర్లు ధ్రువీకరించారు. పోస్టుమార్టం పూర్తయిన వెంటనే ఇందర్‌పాల్ భౌతిక కాయాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. కాగా, ఈనెల జమ్ము రీజియన్‌లో సూసైడ్ చేసుకున్న రెండో వైమానికదళ ఉద్యోగి ఇందర్‌పాల్. ఆగస్టు 8న కూడా ఉదంపూర్‌లో వైమానిక దళానికి చెందిన […]
శ్రీనగర్: ప్రఖ్యాత మాతావైష్ణో దేవి అమ్మవారి సందర్శనం కోసం జమ్ముకాశ్మీర్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆలయంలో అమ్మవారి దర్శనాలను మూసివేశారు. లాక్డౌన్అనంతరం కేంద్ర ప్రభుత్వం కోవిడ్19 నిబంధనలకు అనుగుణంగా ఆలయాలను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి అమ్మవారి దర్శనాలు పున:ప్రారంభం కానున్నాయి. యాత్ర ప్రారంభమయ్యే కత్రా వద్ద ఏర్పాట్లుచేశారు. యాత్రికులు కరోనా పరీక్షలు చేయించుకుని నెగెటివ్ అని తేలితేనే ముందుకు పంపించేందుకు సైన్యం అనుమతిస్తోంది. […]
జమ్మూ: జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. కట్రాకు 88 కి.మీ.దూరంలో తెల్లవారుజామున 4.55 గంటలకు సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదైందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ భూప్రకంపనలతో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని అధకారులు చెప్పారు. గురువారం కూడా జమ్మూకశ్మీర్ లో భూకంపం సంభవించింది. జూన్ 27వతేదీన సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది. జమ్మూకాశ్మీర్, అసోం రాష్ట్రాల్లో వరుస భూకంపాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరుస భూకంపాలతో […]
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని సౌత్ అనంత్‌నాగ్ జిల్లా బిజ్‌బెహరాలో టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో ఒక సీఆర్‌పీఎఫ్ జవాను, ఐదేళ్ల బాలుడు మృతిచెందారు. సెక్యూరిటీ ఫోర్స్‌పై టెర్రరిస్టులు కాల్పులు జరపడంతో ఈ ఘటన జరిగినట్లు ఆర్మీ అధికారులు చెప్పారు. సీఆర్‌పీఎఫ్ 90 బెటాలియన్ వద్ద రోడ్ ఓపెనింగ్ జరుగుతుండగా టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సీఆర్‌పీఎఫ్ జవాను, ఐదేళ్ల బాలుడికి గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్పించగా.. ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయారని పోలీసులు చెప్పారు. టెర్రరిస్టులు కోసం గాలిస్తున్నామని అన్నారు. […]