Breaking News

వైష్ణోదేవి యాత్ర షురూ

వైష్ణోదేవి యాత్ర షురూ

శ్రీనగర్: ప్రఖ్యాత మాతావైష్ణో దేవి అమ్మవారి సందర్శనం కోసం జమ్ముకాశ్మీర్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆలయంలో అమ్మవారి దర్శనాలను మూసివేశారు. లాక్​డౌన్​అనంతరం కేంద్ర ప్రభుత్వం కోవిడ్​19 నిబంధనలకు అనుగుణంగా ఆలయాలను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి అమ్మవారి దర్శనాలు పున:ప్రారంభం కానున్నాయి. యాత్ర ప్రారంభమయ్యే కత్రా వద్ద ఏర్పాట్లుచేశారు. యాత్రికులు కరోనా పరీక్షలు చేయించుకుని నెగెటివ్ అని తేలితేనే ముందుకు పంపించేందుకు సైన్యం అనుమతిస్తోంది. కత్రా చేరుకోవడానికి రైళ్లు అందుబాటులో లేకపోవడంతో జమ్ము విమానాశ్రయం నుంచి ట్యాక్సీ వాహనాల ద్వారా చేరుకోవాల్సి ఉంటుంది.
ఈ నిబంధనలు పాటిస్తేనే..
అమ్మవారిని దర్శించుకునేందుకు ముందుగా ఆన్​లైన్​లో పేర్లను రిజిస్ట్రేషన్​చేయించుకోవాలని మాతా వైష్ణోదేవి ఆలయ బోర్డు సీఈవో రమేశ్ కుమార్ సూచించారు. ప్రతి భక్తుడు తప్పనిసరిగా ఆరోగ్యసేతు యాప్​ను మొబైల్ ఫోన్లలో కలిగి ఉండాలని నిబంధన విధించారు. 10ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు, 60 ఏళ్లకు పైబడిన వారు, గర్భిణులు ప్రయాణించవద్దని సూచించారు.