సారథి న్యూస్, ములుగు: జిల్లా సరిహద్దుల్లో నిఘా పక్కాగా ఉండాలని ములుగు జిల్లా కలెక్టర్ఎస్.కృష్ణఆదిత్య సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలో మహారాష్ట్ర సరిహద్దు రహదారి నుంచి కలప, ఇసుక, పీడీఎస్ బియ్యం, మారకద్రవ్యాల స్మగ్లింగ్ అవుతోందని, జిల్లా నలువైపులా చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా అధికారులతో కలెక్టరేట్ లో రోడ్ సేఫ్టీ కమిటీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నందున రోడ్లకు స్పీడ్ బ్రేకర్లు వేయడం, రేడియం స్టిక్కర్లు అతికించడం, కలరింగ్ […]
సారథి న్యూస్, శ్రీకాకుళం: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతిఒక్కరికీ చేరాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అన్నారు. సోమవారం ఆయన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా సీతంపేట మండల కేంద్రంలో గ్రామసచివాలయాన్ని పరిశీలించారు. పెద్దూరులో గ్రామ సచివాలయాన్ని రూ.40 లక్షలు, వైఎస్సార్హెల్త్ క్లినిక్ ను రూ.17.50 లక్షలు, రూ.21.80 లక్షల వ్యయంతో చేపడుతున్న వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు. […]
సారథి న్యూస్, వెంకటాపురం: గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులపై ప్రత్యేకదృష్టి సారించి, నిర్ణీత లక్ష్యం మేరకు పూర్తిచేయాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణఆదిత్య సూచించారు. శుక్రవారం కలెక్టర్, ఐటీడీఏ పీవో హన్మంతు కె జండగే తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాలపై అధికారులు, ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేసి వ్యక్తిగత శ్రద్ధతో నిర్ణీత లక్ష్యాన్ని పూర్తిచేయాలన్నారు. మండలంలో 9,774 ఇళ్లు ఉండగా,8,658 ఇన్లైన్ […]
సారథి న్యూస్, శ్రీశైలం/ కర్నూలు: దశాబ్దాల కాలం నుంచి పెండింగ్లో ఉన్న గిరిజన భూముల భూవివాదాలకు ఆస్కారం లేకుండా అటవీహక్కుల చట్టం మేరకు ఆర్‌వోఎఫ్‌ఆర్ కింద రాష్ట్రంలో 1.53 లక్షల మంది గిరిజన రైతులకు 3.12లక్షల ఎకరాల భూమిపై హక్కు పత్రాలను పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడవులు, కొండ ప్రాంతాల్లో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న గిరిజన రైతుకు […]
సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి హన్మంత్ శుక్రవారం వెంకటాపురం తహసీల్దార్ ఆఫీసు మరమ్మతులు పరిశీలించారు. అనంతరం ఎదిరా ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. అలుబక గ్రామంలో నర్సరీ మొక్కలు పరిశీలించారు. హరితహారం కింద అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టి, ట్రీ గార్డ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలకు ఫెన్సింగ్ చుట్టాలన్నారు. గ్రామాల్లో వైకుంఠధామం, డంపింగ్ యార్డ్, సెగ్రిగేషన్ షెడ్లు, ఇంకుడుగుంతలు పనులను కంప్లీట్ చేయాలన్నారు. పంచాయతీలకు […]