సారథిన్యూస్, హైదరాబాద్: ఇండియా, చైనా సరిహద్దులో కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గాల్వాన్‌లోయలో ఇరుదేశాల సైన్యాలు ఘర్షణకు దిగడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. కాగా గాల్వాన్ ప్రాంతంలో చైనాకు చెక్‌పెట్టేందుకు భారత్ కీలక అడుగు వేసింది. గల్వాన్ నదిపై భారత సైనిక ఇంజినీర్లు వంతెన నిర్మాణం పూర్తి చేశారు. 60 మీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జిపై నుంచి ఆర్మీ వాహనాలు ఈజీగా నదిని దాటుతాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. గల్వాన్ నదిపై […]
భోపాల్: ఇండియా – చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒకరు చైనాపై కోపంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చైనా వస్తువులను బ్యాన్ చేయాలని అప్పుడే వాళ్లకు బుద్ధి వస్తుందని ప్రజలంతా అభిప్రాయపడుతున్నారు. చాలామంది నేతలు లీడర్లు కూడా ఈ మేరకు పిలుపునిచ్చారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ కూడా ఈ విషయంలో స్పందించారు. చైనాను ఎకనామికల్‌గా దెబ్బతియాలని అప్పుడే బుద్ధి వస్తుందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలంతా చైనా వస్తువులను బ్యాన్ చేయాలని రిక్వెస్ట్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: : భారత్ ఎప్పుడూ శాంతి మంత్రాన్ని పాటిస్తుందని భారత వైమానిక దళాధిపతి ఆర్కేఎస్ భదౌరియా స్పష్టం చేశారు. భారత సైనికులపై కవ్వింపులకు దిగితే మాత్రం ఉపేక్షించబోమని పేర్కొన్నారు. చైనాకు దీటైన సమాధానం చెప్పే సత్తా భారత్ వద్ద ఉన్నదన్నారు. శనివారం హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరిగిన గ్రాడ్యుయేషన్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొత్తగా విధుల్లో చేరబోతున్న క్యాడేట్లను ఉద్దేశించి భదౌరియా ప్రసంగించారు. […]
శ్రీనగర్: భారత భూభాగంలోకి పాకిస్థాన్ గూఢచార సంస్థకు చెందిన ఓ డ్రోన్ రావడంతో బీఎస్‌ఎఫ్ పెట్రోలింగ్ పార్టీ దీన్ని కూల్చివేసింది. జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లా.. హిరానగర్, సెక్టార్‌లో రాతువా ప్రాంతం ఫార్వర్డ్ పోస్టులో పాకిస్తాన్ గూఢచార డ్రోన్ కదలికలను సరిహద్దు భద్రతా దళం గమనించింది. వెంటనే అప్రమత్తమైన 19 బెటాలియన్‌కు చెందిన బీఎస్‌ఎఫ్ పెట్రోలింగ్ పార్టీ దీన్ని కూల్చి వేసింది. ఎనిమిది రౌండ్లు కాల్పుల అనంతరం ఆ డ్రోన్ ను విజయంతంగా నేలమట్టం చేశారు. ఈ […]
కొలంబో: 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఫిక్సయిందని అప్పటి శ్రీలంక క్రీడా మంత్రి మహిందానంద అల్తుగమాగే సంచలన ఆరోపణలు చేశాడు. ఆ మ్యాచ్ ను లంక.. భారత్‌కు అమ్మేసుకున్నదని విమర్శించాడు. ‘ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ మేం అమ్మేసుకున్నామని నేను ఈ రోజు చెబుతున్నా. అప్పుడు నేనే క్రీడా మంత్రిగా ఉన్నా.. ఆ సమయంలో చెప్పే అవకాశం రాలేదు. కానీ ఇప్పుడు చెప్పడం నా బాధ్యతగా భావిస్తున్నా’ అని మహిందానంద వ్యాఖ్యానించాడు. 2010 నుంచి 2015 వరకు లంక […]
న్యూఢిల్లీ: చైనా చేసిన దాడి నేపథ్యంలో ఆ దేశ స్పాన్సర్లతో తెగదెంపులు చేసుకుంటామని భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) ప్రకటించినా.. బీసీసీఐ మాత్రం వెనుకడగు వేసింది. ఇప్పటికైతే ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ వివోతో తెగదెంపులు చేసుకునే అవకాశాలు ఇప్పటికైతే లేవని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ వెల్లడించాడు. తదుపరి ఒప్పందం కోసం స్పాన్సర్ షిప్ విధానంపై సమీక్షిస్తామని తెలిపింది. ప్రస్తుతం ఆర్థికాభివృద్ధికి సాయంగా నిలుస్తున్న వివోతో సంబంధాన్ని ముగించలేమన్నారు. ఏడాదికి రూ. 440 కోట్లు చెల్లించే విధంగా […]
సారథిన్యూస్, సూర్యాపేట: భారత్-చైనా సరిహద్దులో మాతృభూమి కోసం ప్రాణలర్పించిన సంతోష్‌బాబుకు యావత్ భారతావని కన్నీటి వీడ్కోలు పలికింది. సూర్యాపేట సమీపంలోని కేసారంలో సైనికలాంచనాల నడుమ సంతోష్‌బాబుకు అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమయాత్రలో భారీగా ప్రజలు పాల్గొన్నారు. ఆర్మీ జవాన్లు వీరజవానుకు నివాళిగా మూడుసార్లు గాల్లోకి కాల్పులు జరిపారు. తండ్రి సురేశ్‌బాబు చితికి నిప్పంటించారు. రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి సంతోష్‌బాబు పార్థివదేహం వద్ద నివాళి అర్పించారు.
అమెరికాకు చెందిన ఓ పరిశోధనసంస్థ కరోనాకు వ్యాక్సిన్‌ను సిద్ధం చేస్తున్నది. రెమ్డెసివీర్ అనే వ్యాక్సిన్ కోవిడ్ కు కొంతవరకు అశాజనకంగా పనిచేస్తున్నదని వైద్యులు చెప్తున్నారు. దీంతో దీన్ని ఉత్పత్తి చేసేందుకు అమెరికాకు చెందిన ప్రముఖ పరిశోధన సంస్థ గిలీడ్ ఆసక్తి చూపుతున్నది. ఈ సంస్థ ఇండియాలోని సిప్లా, జుబిలెంట్ లైఫ్ సైన్స్, హెటిరో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, జైడస్, క్యాడిలా ఫార్మా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీలు వ్యాక్సిన్ ను తయారు చేసి 127 దేశాలకు […]