బీజేపీ నేత విజయ పాల్ రెడ్డి సారథి న్యూస్, హుస్నాబాద్: గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుకు ఎమ్మెల్యే సతీష్ కుమార్ నీళ్లు తీసుకొస్తే గుండు గీసుకుంటామని బీజేపీ హుస్నాబాద్ అసెంబ్లీ కన్వీనర్ నాగిరెడ్డి విజయ పాల్ రెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టును పూర్తిచేయకుండా ఎవరు అడ్డుపడ్డారని ప్రశ్నించారు. ముందు నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో అక్కన్నపేట బీజేపీ మండలాధ్యక్షుడు వీరాచారి, హుస్నాబాద్ టౌన్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, శంకర్ […]
హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ సారథి న్యూస్, హుస్నాబాద్: గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులపై కోర్టుల్లో వేసిన కేసులను కొట్టివేస్తే నెలరోజుల్లో నీళ్లు తెప్పిస్తానని ప్రతిపక్షాలకు ఎమ్మెల్యే సతీష్ కుమార్ సవాల్ విసిరారు. ఆదివారం పట్టణంలోని తిరుమల గార్డెన్ లో వ్యవసాయ విధానంపై రైతులకు ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. రైతాంగం సుభిక్షంగా ఉండాలంటే ప్రభుత్వం నిర్దేశించిన పంటలను మాత్రమే పండించాలన్నారు. ప్రతిపక్షాలు ప్రాజెక్టులపై లేనిపోని రాద్ధాంతం చేస్తూ ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ […]
సారథి న్యూస్, హుస్నాబాద్: అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు మరణం సీపీఐకి తీరనిలోటని రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపె మల్లేష్ అన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని అనభేరి, సింగిరెడ్డి భూపతిరెడ్డి అమరుల భవనంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. నాగేశ్వరరావు రైతు, కూలీల హక్కుల సాధనకు సమరశీల పోరాటాలు చేశాడని గుర్తుచేశారు. రైతు సంఘం జిల్లా సహయ కార్యదర్శి హన్మిరెడ్డి, రాజారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు వనేశ్, కోమురయ్య, భాస్కర్, సుదర్శనాచారి, లక్ష్మినారాయణ, ఏఐవైఎఫ్ […]
కాంగ్రెస్ లీడర్లపై టీఆర్ఎస్ నేతల ఫైర్ సారథి న్యూస్, హుస్నాబాద్: రైతులపై కాంగ్రెస్ లీడర్లు ముసలి కన్నీరు కారుస్తున్నారని హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా గురువారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వ్యవసాయం విస్తీర్ణం పెంచడమే కాకుండా బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను నిర్మించిందన్నారు. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు చెరువులు కుంటలు నింపితే కాంగ్రెస్ నాయకులు ఓర్వలేక అసత్య ప్రచారాలు […]
సారథి న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలం తంగళ్లపల్లి, కూరెళ్ల గ్రామాలకు సమీపంలో ఉన్న మోయతుమ్మెద వాగులో బుధవారం సాయంత్రం గుడ్డెలుగులు సంచరించడంతో స్థానిక రైతులు, గ్రామస్తులు హడలిపోయారు. గుడ్డెలుగులు కొన్ని నెలలుగా ప్రజలు, రైతులు వ్యవసాయ క్షేత్రాలకు రాత్రివేళలో వెళ్లలేకపోతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి జనారణ్యంలో సంచరిస్తున్న వాటిని తరలించాలని స్థానికులు కోరుతున్నారు.