Breaking News

GODAVARIKHANI

బొగ్గుగనుల వేలం నిలిపివేయండి

గోదావరిఖని: సింగరేణి బొగ్గుగనుల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని వివిధ సంఘాల నాయకులు డిమాండ్​ చేశారు. ఏఐటీయూసీ, సీఐటీయూ పిలుపుమేరకు ఆర్జీ​​-1 లో కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఏఐటీయూసీ కేంద్రకమిటీ సెక్రటరీ మెరుగు రాజయ్య మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం ఇష్టారాజ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసిందని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు మడ్డి ఎల్లయ్య, వేల్పుల కుమారస్వామి, మెండే శ్రీనివాస్, ఉల్లి మొగిలి, జీ ఆనందం, పీ రవి, ఏ […]

Read More

మోకే ఉరితాడైంది

సారథిన్యూస్​, గోదావరిఖని: కల్లు తీసేందుకు వెళ్లిన ఓ గీతకార్మికుడికి.. మోకు మెడకు చుట్టుకొని ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గుర్రంపల్లి గ్రామంలో విషాదం నింపింది. గుర్రంపల్లికి చెందిన మామిడి రాజు ప్రతిరోజు మాదిరిగానే కల్లు తీసేందుకు మోకు సాయంతో తాటిచెట్టు ఎక్కాడు. ఈ క్రమంలో మోకు.. మెడకు చుట్టుకున్నది. దీంతో ఉపిరాడక అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన తోటి గీతకార్మికులు మృతదేహాన్ని చెట్టుపైనుంచి కిందకు దించారు.

Read More

ప్రాణం తీసిన సెల్ఫీ సరదా

సారథిన్యూస్​, గోదావరిఖని: సెల్ఫీ సరదా ఓ విద్యార్థి ప్రాణం తీసింది. గోదావరిఖనికి చెందిన యశ్వంత్(22) ఓ కళాశాలలో పాల్​టెక్నిక్​ డిప్లమో చదువుతున్నాడు. సోమవారం సరదాగా పెద్దపల్లి జిల్లాలోని సబ్బితం జలపాతం వద్దకు వెళ్లాడు. అక్కడ సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు.

Read More

సింగరేణిలో కరోనా కలవరం

సారథి న్యూస్​, గోదావరిఖని: పట్టణంలోని సింగరేణి తరియా హాస్పిటల్ లో కరోనా కలవరం మొదలైంది. రెండు రోజుల క్రితం 8 ఇంక్లయిన్​ కాలనీకి చెందిన సింగరేణికి చెందిన ఓ కార్మికుడు మృతిచెందిన విషయం తెలిసిందే, కాగా, బుధవారం గోదావరిఖనికి చెందిన మరో సూపర్​వైజర్​ స్థాయి ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ప్రచారం జరగడంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కలవరం నెలకొంది. రెండురోజుల క్రితం సింగరేణి ఆస్పత్రిలో సదరు బాధితుడు అందరితో కలిసి తిరిగాడని అతని […]

Read More
షార్ట్ న్యూస్

ప్రైవేటీకరణను వ్యతిరేకించండి

సారథి న్యూస్​, గోదావరిఖని: బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 10, 11 తేదీల్లో బొగ్గు గనుల వద్ద జరిగే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరుతూ ఆదివారం గోదావరిఖని గాంధీనగర్​లోని ఐఎఫ్ టీయూ ఆఫీసులో విప్లవ కార్మిక సంఘాల జేఏసీ సమావేశం నిర్వహించారు.

Read More

కరోనా పోలే.. జాగ్రత్తగా ఉండాలె

సారథి న్యూస్​, గోదావరిఖని: కరోనా వైరస్​ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తగా ఉండాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్​ సిక్తాపట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కోవిడ్​–19 నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం స్థానిక కలెక్టరేట్​లో అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలను సడలించిన నేపథ్యంలో ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తున్నారని, దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో రాత్రిపూట కర్ఫ్యూను కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. వృద్ధులు, […]

Read More

గనిలో పేలుడు.. నలుగురి దుర్మరణం

సారథి న్యూస్​, గోదావరిఖని: జిల్లా రామగుండం డివిజన్-3 పరిధిలోని ఓపెన్ కాస్ట్(ఉపరితల గని)-1 లోని ఫేస్-2లో గల బ్లాస్టింగ్ స్పాట్ వద్ద మంగళవారం ప్రమాదవశాత్తు పేలుడు సంభవించిన ఘటనలో నలుగురు కార్మికులు బండి ప్రవీణ్ (గోదావరిఖని), రాజేష్( ఖమాన్పూర్), అంజయ్య, రాకేష్ మృతిచెందారు. మరో ఇద్దరు కార్మికులు వెంకటేష్, భీమయ్య తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం సంభవించిన ప్రాంతాన్ని రామగుండం పోలీస్​ కమిషనర్​ సత్యనారాయణ పరిశీలించారు. సంఘటనకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read More
సరుకులు పంపిణీ

సరుకులు పంపిణీ

సారథిన్యూస్​, గోదావరిఖని: రామగుండం నియోజకవర్గ పరిధిలోని పాలకుర్తి మండలం ధర్మారం చౌరస్తాలో వందమంది ఆటో డ్రైవర్లకు రాధాస్ ఆయుర్వేద హాస్పిటల్​ డాక్టర్ అద్దంకి శరత్, మడిపెల్లి మల్లేష్, జడ్పీటీసీ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో మంగళవారం బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కుందన పల్లి మాజీ సర్పంచ్ మైసయ్య, ఇంజం సాంబశివరావు, గాజుల రమేష్, తిరుమలచారి, వెంకటేశ్​, పాషా, ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు.

Read More