న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఎంపీలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కనాటారు. రాజ్యసభ ఎంపీలు కె.కేశవరావు, బడుగుల లింగయ్య యాదవ్, కేఆర్ సురేష్ రెడ్డి, పార్లమెంట్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, గడ్డం రంజిత్ రెడ్డి, పోతుగంటి రాములు, బోర్లకుంట్ల వెంకటేష్ నేత, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
సామాజిక సారథి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి ప్రధాన ఆలయ విమాన గోపురానికి స్వర్ణం తాపడం కోసం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రెండు కిలోల బంగారాన్ని విరాళంగా అందజేశారు. సీఎం కేసీఆర్ సమక్షంలోనే ఆయన గతంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఆ హామీ మేరకు బంగారాన్ని ఆలయానికి అప్పగించారు. శుక్రవారం కుటుంబసమేతంగా లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనం పలికారు. అంతకుముందు ఆలయ మర్యాదలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం […]
మహేశ్ అభిమానులకు ‘సర్కార్‌వారిపాట’ చిత్ర యూనిట్ ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వనున్నట్టు సమాచారం. మహేశ్ భర్త్‌డే సందర్భంగా ఈనెల 9న చిత్రయూనిట్ టైటిల్ ట్రాక్‌ను విడుదల చేయబోతున్నట్టు తెలుస్తున్నది. ఈ చిత్రానికి పరుశురామ్ దర్శకత్వం వహిస్తుండగా తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. కీర్తీ సురేశ్‌తోపాటు , మరో కథానాయిక కూడా మహేశ్‌తో ఆడిపాడనున్నది. దీంతో పాటు మహేశ్ భర్త్‌డే సందర్భంగా ఎస్ఎస్ రాజమౌళితో చేయబోయే చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం.
బెంగళూరు: ప్లాస్మా దానం చేసే కరోనా రోగులకు రూ.5000 ప్రోత్సాహం అందిస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. కరోనా రోగులకు ప్లాస్మాథెరపీతో ఆశాజన ఫలితాలు వస్తున్న విషయం తెలిసిందే. ప్లాస్మాథెరపీ వైద్యం చేయాలంటే ఇప్పటికే వ్యాధి సోకి నయమైనవారి రక్తంలో నుంచి ప్లాస్మా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కరోనా బాధితులు ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు రావడంలేదు. దీంతో ప్లాస్మా ఇచ్చే వారికి రూ.5000 ప్రోత్సాహం ఇస్తామంటూ కర్ణాటక రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిబీ శ్రీరాములు ప్రకటించారు.కరోనా నుంచికోలుకున్న వారు […]