Breaking News

GHMC

కరోనా నివారణకు పకడ్బందీ చర్యలు

కరోనా నివారణకు పకడ్బందీ చర్యలు

సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్​ సూచించారు. గురువారం ఆయన వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి సయ్యద్‌ అలీ ముర్తుజాతో సమీక్షించారు. మార్చిన 2న రాష్ట్రంలో కరోనా కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు డాక్టర్లు, వైద్యసిబ్బంది విరామం లేకుండా పనిచేస్తున్నారని కొనియాడారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని ఐసోలేట్​ చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో బస్తీ దవాఖానాల్లో మందులు, డాక్టర్లు అందుబాటులో ఉంచాలని మంత్రి ఈటల కోరారు.

Read More

కరోనాతో 10 మంది మృతి

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో అదేస్థాయిలో కరోనా మహమ్మారి కొనసాగుతోంది. మంగళవారం 1,524 పాజిటివ్​కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా 37,745 కు కరోనా కేసులు చేరాయి. తాజాగా మహమ్మారి బారినపడి 10 మృతిచెందారు. చికిత్స అనంతరం ఒకేరోజు 1,161 మంది డిశ్చార్జ్ అయ్యారు.జీహెచ్ఎంసీ పరిధిలో 815 పాజిటివ్ నమోదయ్యాయి. ఇప్పటివరకు మృతుల సంఖ్య 375కు చేరింది. ఇప్పటివరకు 1, 95, 024 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే రంగారెడ్డి 240, మేడ్చల్ 97, […]

Read More
తెలంగాణలో కాస్త ఊరట

రాష్ట్రంలో 1,269 పాజిటివ్ ​కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి కొంచెం తగ్గినట్టే కనిపిస్తోంది. గత మూడు నాలుగు రోజులతో పోల్చితే ఆదివారం కేసులు తగ్గాయి. ఆదివారం తాజాగా 1,269 పాజిటివ్​కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి 8 మంది మృతిచెందారు. అయితే ఇప్పటి వరకు 356 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 1,70,324 మందిని పరీక్షించారు. మొత్తం పాజిటివ్​కేసుల సంఖ్య 34,671కు చేరింది. జీహెచ్​ఎంసీ పరిధిలో 800 కేసులు, రంగారెడ్డి జిల్లా 132, మేడ్చల్​ 94, సంగారెడ్డి 36, వరంగల్​ […]

Read More
తెలంగాణలో 1,178 కేసులు,

తెలంగాణలో 1,178 కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో శనివారం 1,178 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా మహమ్మారి బారినపడి 9 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు మొత్తంగా 348 మంది బలయ్యారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ ​కేసులు 33,402 కు చేరాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,62,171 టెస్టులు చేశారు. జీహెచ్​ఎం పరిధిలో 736 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే రంగారెడ్డి జిల్లా 125, మేడ్చల్​101, సంగారెడ్డి 13, వరంగల్ అర్బన్​ 20, కరీంనగర్​24, సిరిసిల్ల […]

Read More
ఏది అవసరం?

ఏది అవసరం?

సారథి న్యూస్, హైదరాబాద్: ‘కరోనా కట్టడి కోసం మార్చి నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం రూ.475 కోట్లను ఖర్చుచేసింది..’ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఇటీవల అధికారికంగా చేసిన ప్రకటన ఇది. కానీ ఇంతకు మించి నూతన సచివాలయ నిర్మాణం కోసం సర్కారు ఏకంగా రూ.500 కోట్లను కేటాయించడం గమనార్హం. ఏడాది కాలంలో దీన్ని పూర్తిచేసేందుకు నిర్ణయించిన నేపథ్యంలో ఈ అంచనాలు రూ.వెయ్యి కోట్ల దాకా ఎగబాకే అవకాశాలు లేకపోలేదని ఆర్థికశాఖ అంచనా. దీన్నిబట్టి కరోనా నివారణ, […]

Read More
తెలంగాణ @ 1,924

తెలంగాణ @ 1,924

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 1,924 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 29,536 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,933 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా 992 మంది డిశ్చార్జ్​కాగా, ఇప్పటివరకు 17,279 మంది కోలుకున్నారు. తాజాగా 11 మందితో కలిపి మొత్తంగా 324 మంది మహమ్మారి బారినపడి మృతిచెందారు. ఇప్పటివరకు 1,34,801 టెస్టులు చేశారు. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో […]

Read More
ఒకేరోజు 1,831 కేసులు

ఒకేరోజు 1,831 కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా(కోవిడ్​19) కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. సోమవారం రాష్ట్రంలో కొత్తగా 1,831 పాజిటివ్​కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కేసులు 25,733కు చేరాయి. మహమ్మారి బారినపడి తాజాగా 11 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు 1,22,218 మందికి కరోనా టెస్టులు చేశారు. ఇప్పటివరకు 306 మంది మృత్యువాతపడ్డారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,419 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలో 160, మేడ్చల్​ జిల్లాలో 117 కేసులు, మెదక్​లో 20, మంచిర్యాల జిల్లాలో 20, ఖమ్మం […]

Read More

పల్లెల్లోనూ జాగ్రత్త అవసరం

సారథిన్యూస్, రామడుగు: జీహెచ్​ఎంసీలో కరోనా విజృంభిస్తుండటంతో హైదరాబాద్​లోని ప్రజలంతా పల్లెలకు వస్తున్నారు. ఈ క్రమంలో కరోనా పల్లెలకు కూడా పాకే అవకాశం ఉన్నదని.. అందువల్ల గ్రామీణప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం రంగసాయిపల్లిలో గ్రామానికి చెందిన యువకులు కరోనాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు. దుకాణాల వద్ద, రచ్చబండ వద్ద ప్రజలు గుంపులుగా ఉండొద్దని, అనవసరంగా గ్రామంలో తిరుగొద్దని సూచించారు. అనవరంగా మాస్కులేకుండా […]

Read More