Breaking News

GADWAL

లంచం తీసుకుంటూ దొరికిన పెద్దడాక్టర్​

అడ్డంగా దొరికిన పెద్ద డాక్టర్

సారథిన్యూస్​, గద్వాల: లంచం తీసుకుంటూ జోగుళాంబ గద్వాల జిల్లా డీఎంహెచ్​వో భీమ్​నాయక్​ ఏసీబీ అధికారులను రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని వడ్డేపల్లి మండలంలో డాక్టర్​ ఏ మంజుల మెడికల్​ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె కాకతీయ యూనివర్సిటీలో పీజీలో జాయిన్​ అయ్యారు. ఇందుకోసం రిలీవింగ్​ ఆర్డర్​ కోసం డీఎంహెచ్​వోకు దరఖాస్తు చేసుకున్నారు. లంచాలకు అలవాటు పడ్డ డీఎంహెచ్​వో తన కిందిస్థాయి ఉద్యోగిని సైతం రూ. 7000 లంచం అడిగాడు. దీంతో మంజుల […]

Read More

ఇంత అమానుషమా

సారథిన్యూస్​, జోగుళాంబ గద్వాల: కరోనా విపత్తువేళ మనుషులల్లో మానవత్వం మంటగలుస్తున్నది. సన్నిహితులు, కుటుంబసభ్యులు, కన్నవాళ్లు, తోబుట్టువుల పట్ల కూడా అమానుషంగా వ్యవహరిస్తున్నారు కొందరు వ్యక్తులు. తాజాగా జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురంలో ఓ వ్యక్తి (35) చనిపోగా.. కరోనాతో మరణించాడేమోనన్న అనుమానంతో అతడి మృతదేహాన్ని ప్రొక్లెయిన్​లో తీసుకెళ్లి ఖననం చేశారు కుటుంబసభ్యులు. చనిపోయిన వ్యక్తికి కరోన లేదని వైద్యులు నిర్ధారించినప్పటికి కొందరు ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు.

Read More
నడిగడ్డలో కరోనా కలకలం

నడిగడ్డలో కరోనా కలకలం

సారథి న్యూస్​, జోగుళాంబ గద్వాల: నడిగడ్డకు కరోనా కునుకు లేకుండా చేస్తోంది. మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. గురువారం వరకు జోగుళాంబ గద్వాల జిల్లాలో 42 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. తాజాగా గురువారం ఒక్కరోజే 10 పాజిటివ్​ కేసులు నమోదుకావడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా కేంద్రంలోనే ఏడు కేసులు నమోదయ్యాయి. ఆలంపూర్ నియోజకవర్గం అయిజ మండలం ముగోనిపల్లి గ్రామంలో ముగ్గురు, గద్వాల టౌన్ లో ఏడుగురికి పాజిటివ్ నిర్ధారణ అయింది.

Read More