Breaking News

FLAG

జెండాపండుగ మరిచారు

సారథి న్యూస్, రామడుగు: దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతుంటే.. కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని గ్రంథాలయంలో మాత్రం జెండా ఎగురవేయలేదు. కాగా ఈ విషయంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే జెండాపండుగను మరిచిపోయారని వారు విమర్శిస్తున్నారు. విజ్ఞానం పంచి మేధావులను తయారు చేసే గ్రంథాలయంలో జండా ఎగరవేయక పోవటం ఏమిటని గ్రంథపాలకుడి తీరుపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Read More
ఊరూరా జెండా పండుగ

ఊరురా జెండా పండుగ

సారథి న్యూస్​, నెట్​వర్క్​: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 74వ స్వాతంత్ర్య వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో కేవలం కొద్దిమంది అతిథులు మాత్రమే ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పరిమిత సంఖ్యలో అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రమే వేడుకలకు హాజరయ్యారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలో స్వేరోస్​ ఆధ్వర్యంలో పంద్రాగస్టు వేడుకలు జరుపుకున్నినారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో పోలీస్ కమిషనరేట్​లో కమిషనర్​ వి.సత్యనారాయణ జెండాను ఎగురవేశారు. కరీంనగర్​ జిల్లా రామడుగు గ్రామ పంచాయతీలో సర్పంచ్ పంజాల […]

Read More

మనశక్తిని ప్రపంచానికి చాటుదాం

ఢిల్లీ: మనదేశ శక్తిని ప్రపంచానికి ప్రపంచానికి చాటాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. 74 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానిమోడీ శనివారం ఢిల్లీలోని ఎర్రకోటపై ఏర్పాటుచేసిన మువ్వన్నెల జెండాను ఎగరవేశారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారిని ఎదుర్కొంటుంది. మనం కూడా కరోనాతో రాజీలేని పోరాటం చేస్తున్నాం. కరోనాపై పోరాటంలో శక్తివంచన లేకుండా కృషిచేస్తున్న కరోనా వారియర్స్​కు (డాక్టర్లు, నర్సులు, వైద్యసిబ్బంది, […]

Read More