సారథిన్యూస్, రామగుండం: రామగుండం కమిషనరేట్ పరధిలో గణేశ్ మండపాలకు అనుమతి లేదని.. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా మండపాలు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని కమిషనర్ సత్యనారాయణ హెచ్చరించారు. శుక్రవారం ఆయన పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీసులకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు పలు సూచనలు చేశారు. కరోనా నివారణ గురించి అధికారులు సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. తప్పకుండా మాస్కులు, గ్లౌజులు ధరించాలని సూచించారు.
సారథి న్యూస్, నల్లగొండ: ప్రస్తుత పరిస్థితుల్లో గణేశ్ మండపాలు, నవరాత్రి ఉత్సవాలకు అనుమతి ఇవ్వలేమని నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. కరోనా విపత్తువేళ హిందూ సోదరులంతా పోలీస్‌శాఖకు సహకరించాలని ఆయన కోరారు. గణేశ్ మండపాల నిర్వాహకులకు త్వరలోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ప్రజలంతా ఇండ్లల్లోనే పూజలు చేసుకోవాలని కోరారు. తయారీదారులు విగ్రహాలను తయారు చేసి ఇబ్బందులు తెచ్చుకోవద్దని.. కరోనా పోయేంత వరకు ఇతర ఉపాధి మార్గాలను వెతుక్కోవాలని సూచించారు.