వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వంపై మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాను కట్టడి చేయడంలో అమెరికా ప్రభుత్వం విఫలమైందన్నారు. ‘అమెరికాలో టెస్టులు చేసిన 24 గంటలకు ఫలితాలు వస్తున్నాయి. ఇది ఒక పనికిమాలిన విధానం. దీనివల్ల ఎటువంటి ఫలితం ఉండదు. టెస్టులు చేయించుకున్న కరోనా అనుమానితులు ఇష్టమున్నట్టు ప్రజల్లో తిరిగి కరోనాను వ్యాపింపచేస్తారు. దీంతో కరోనా మరింత పెరుగుతుంది. టెస్టులు చేసిన కొన్ని నిమిషాల్లోనే ఫలితాలు రావాలి. కరోనా పేషేంట్లందరనీ క్వారంటైన్ చేయాలి అప్పడే వ్యాధిని […]
సారథి న్యూస్, గద్వాల: కరోనాను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నేత షేక్ షావలీ ఆచారి విమర్శించారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వం ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా విస్తరిస్తున్న తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయని ఆరోపించారు. గద్వాల జిల్లాలో తక్కువ సంఖ్యలో టెస్టులు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అనారోగ్యంతో ఉన్నవారందరికీ టెస్టులు చేయాలని కోరారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు […]
సారథిన్యూస్, రామడుగు: కరోనాను అరికట్టడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ వెన్న రాజమల్లయ్య ఆరోపించారు. మంగళవారం కరీంనగర్ జిల్లా రామడుగులో ఆయన మీడియాతో మాట్లాడారు. డబ్ల్యూహెచ్ వో సూచనలు పాటించకపోవడంతోనే అధిక మరణాలు సంభవిస్తున్నాయనన్నారు. చావుకు ఎదురు నిలిచిన డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పాత్రికేయులకు, కనీస సౌకర్యాలు కల్పించకపోవడం శోచనీయం అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరారు.