తమిళ హీరో విష్టు విశాల్‌ను బాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల పెళ్లాడనున్నారు. ఇటీవల వీరిద్దరూ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఈ మేరకు సోమవారం విష్ణు ట్విట్టర్లో ఫొటోలు షేర్ చేశాడు. రెండేళ్ల నుంచి వీళ్లు ప్రేమలో ఉన్నారు. త్వరలోనే జ్వాలను తాను పెళ్లిచేసుకోబోతున్నట్టు విష్ణు ట్విట్టర్లో పేర్కొన్నాడు. ‘జ్వాలా.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మనం ఆశావహ దృక్ఫథంతో ముందుకెళదాం. మా కొత్త జీవితానికి మీ అందరి ఆశీర్వాదం కావాలి’ అంటూ విష్ణు ట్వీట్ చేశాడు.
ప్రముఖ హాస్యనటి, తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితురాలైన విద్యుల్లేఖ రామన్ త్వరలోనే తన ప్రియున్ని పెళ్లి చేసుకోబోతుంది. కొంత కాలంగా ఆమె ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ సంజయ్‌తో ప్రేమలో పడింది. కాగా మంగళవారం చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్లో వీరిద్దరికి ఘనంగా ఎంగేజ్మెంట్ జరిగింది. ఇరు కుటుంబాల ఆమోదంతోనే వివాహం నిశ్చయమైంది. కొంతమంది ప్రముఖులు, సమీప బంధువుల సమక్షంలో నిశ్చితార్థం నిర్వహించారు. ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్ పిక్స్ వైరల్‌గా మారాయి.
ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడితో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఎంగేజ్మెంట్ జరిగినట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం బయటకు రాలేదు. అయితే ఇటీవల కాజల్ ముంబైలోని ఓ హోటల్లో బిజినెస్మెన్ కుమారుడితో రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు సమాచారం. తల్లిదండ్రులు సూచించిన వ్యక్తినే కాజల్ పెళ్లాడబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం కాజల్ తెలుగులో చిరంజీవి ‘ఆచార్య’లో నటిస్తుంది. దాంతో పాటు మంచు విష్ణు మోసగాళ్లు సినిమాలో కూడా నటిస్తుంది. ఇవే […]
మెగాబ్రదర్ నాగబాబు కూతురు, నటి నిహారిక.. ఎంగేజ్మెంట్ గురువారం రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్లో నిరాడంబరంగా జరిగింది. గుంటూరు ఐజీ ప్రభాకరరావు కుమారుడు చైతన్యతో నిహారిక పెళ్లి నిశ్చయమైన విషయం తెలిసిందే. కాగా, కేవలం కొంతమంది అతిథులు మధ్య ఎంగేజ్మెంట్ వేడుకను నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహారెడ్డి, సాయి ధరమ్ తేజ్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. నిహారిక ‘ఒక మనసు’ చిత్రం ద్వారా తెలుగులోకి […]
ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నారట.. అలా ఉంది వీళ్ల తీరు చూస్తుంటే. ఇలా ప్రేమ సెల్ఫీ వైరల్ అయ్యిందో లేదో, రానా, మిహికాల నిశ్చితార్థం అయిపోయిందంటున్నారు జనాలు. నిన్న సాయంత్రమే నిశ్చితార్థం జరిగిపోయిందని ప్రచారం జరగడంతో అదేమీ నిజం కాదంటూ కొట్టి పారేశాడు రానా ఫాదర్ సురేష్ బాబు. ఇంకా రెండు కుటుంబాలు కలసి కూర్చొని మాట్లాడుకోనేలేదు.. అప్పుడే నిశ్చితార్థం ఏమిటి అంటున్నాడు. ప్రజెంట్ సిట్యుయేషన్ లో అది సాధ్యం కాదని కూడా అన్నాడు. […]