సారథిన్యూస్, రామడుగు: పనుల్లో అలసత్వాన్ని సహించే ప్రసక్తే లేదని డీఆర్డీవో వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శనివారం ఆయన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశురాజ్పల్లి గ్రామంలో పర్యటించారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు నీరు పట్టేందుకు వెంటనే నీటి తొట్టెల ను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలో రోడ్డుకిరువైపులా నాటిన మొక్కలను పరిశీలించారు. కార్యక్రమంలో ఏపీడీవో మంజుల దేవి, ఎంపీడీవో మల్హోత్ర, ఎస్సారెస్పీ డీఈ, సర్పంచ్ కోల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
విజయం ఎప్పుడూ వెంటనే వరించదు. తన కోసం తపించే వారి మనసును పరీక్షిస్తుంది. అడ్డంకులను సృష్టించి, కష్టాలను కలిగిస్తుంది. అవకాశాలను చేజారుస్తుంది. వాటన్నింటినీ తట్టుకుని, కష్టాల కన్నీటిని అదిమిపట్టి, ఎంత కష్టమొచ్చినా ఎదిరించి నిలిచిన వారికే అది వరమవుతుంది. 14 ఏళ్ల వయస్సులో బడిలో ఉండాల్సిన అమ్మాయి పెళ్లి పీటల మీద కూర్చుంది. 23 ఏళ్లకే ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఏదైనా ఉద్యోగం చేయాలనే తండ్రి కలను నెరవేర్చింది. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అంచెలంచెలుగా […]
న్యూఢిల్లీ: రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) భారత వైమానిక దళానికి మరో శక్తివంతమైన మిస్సైల్ ను అందించనుంది. ఈ మిస్సైల్ ఎయిర్ టు ఎయిర్.. అంటే గాలిలోనే తన కమాండ్స్ మార్చుకునేలా, గాలిలోనే శత్రుదేశాల విమానాలను ధ్వంసం చేసే సామర్థ్యంతో దీన్ని రూపొందిస్తున్నారు. మరెంతో విశిష్టమైన టెక్నాలజీపరమైన ప్రత్యేకతలు దీని సొంతమని తెలుస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే భారత వైమానిక దళం శక్తిసామర్థ్యాలు మరింత పెరుగుతాయని రక్షణరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.