Breaking News

DGP MAHENDARREDDY

పోలీసు ఆఫీసర్లు ఎక్కడికి వెళ్లొద్దు

పోలీసు ఆఫీసర్లు ఎక్కడికీ వెళ్లొద్దు

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీవర్షాలు కురిసే అవకాశం ఉండడంతో స్టేషన్ హౌస్ ఆఫీసర్ల నుంచి జిల్లా ఎస్పీలు, పోలీస్​ కమిషనర్లు అందరూ అప్రమత్తంగా ఉండాలని డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో సీఎం కె.చంద్రశేఖర్​రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో పోలీస్ శాఖను డీజీపీ అప్రమత్తం చేశారు. పోలీస్ అధికారులంతా 24 గంటల పాటు విధుల్లో ఉండి ప్రజలకు అసౌకర్యాలు కలగకుండా చూడాలని సూచించారు. […]

Read More
విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టొద్దు

విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టొద్దు

హైదరాబాద్​: సోషల్‌ మీడియా పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తిచేశారు. సోషల్ మీడియాలో తప్పడు పోస్టులు బెంగళూరులో ఎంత విద్వేషానికి దారి తీశాయో, ఎంత ప్రాణ, ఆస్తినష్టానికి కారణమైందో తెలుసుకోవాలని కోరారు. శాంతి భద్రతలను దెబ్బతీసే అలాంటి పోస్టులు పెట్టొద్దని సూచించారు. సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని తెలంగాణ పోలీసులు నిరంతరం గమనిస్తున్నారని, అలాంటి వారిపై వెంటనే కేసులు పెట్టి, కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. […]

Read More
ప్రజలకు పోలీసే మంచి స్నేహితుడు

ప్రజలకు పోలీసే మంచి స్నేహితుడు

సారథి న్యూస్​, హైదరాబాద్​: ప్రజలకు పోలీసే మంచి స్నేహితుడని తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్విట్టర్​ ద్వారా ఫ్రెండ్స్​షిప్​ డే ప్రాముఖ్యతను చెప్పారు. ‘ప్రజల ప్రతి అవసరంలోనూ స్పందించే వాడు, ప్రజలకు భద్రత, రక్షణ కల్పించేవాడు, అనునిత్యం ప్రజల క్షేమం గురించి ఆలోచించేవాడు పోలీసును మించిన మరో స్నేహితుడు లేడు. చట్టానికి, సమాజానికి కట్టుబడి ఉండే ప్రతి ఒక్కరికీ పోలీసుల కంటే మంచి స్నేహితుడు ఉండబోరు..’ అని అన్నారు. […]

Read More