సారథిన్యూస్, గోదావరిఖని: సింగరేణి తన వ్యాపార విస్తరణలో భాగంగా నూతన ప్రాజెక్టులను ఏర్పాటు చేయబోతున్నదని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ తెలిపారు. సోమవారం ఆయన సింగరేణి ఉన్నతాధికారలతో సమావేశమయ్యారు. సింగరేణి సంస్థ రిజర్వాయర్ల నీటిపై తేలియాడే సోలార్ ప్లాంటులను నిర్మించేందుకు సమాయత్తమవుతుందని చెప్పారు. దాదాపు 500 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను నిర్మించనున్నామని చెప్పారు. సమావేశంలో సింగరేణి డైరెక్టర్ (ఇ&ఎం) ఎస్ శంకర్, రాష్ట్ర రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ శాఖ వైస్ ప్రెసిడెంట్ జానయ్య, ప్రాజెక్టు డైరెక్టర్ […]
సారథిన్యూస్, వరంగల్ అర్బన్: వరంగల్ నగరపాలక సంస్థ అభివృద్ధి కోసం చేపడుతున్న పనులను సకాలంలో పూర్తిచేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వారు వరంగల్‌లో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, నగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతీ, కుడా […]
సారథి న్యూస్ ఆదిలాబాద్: సీఎం కేసీఆర్ ఆదిలాబాద్ జిల్లాపై కక్ష గట్టారని.. అభివృద్ధికి నిధులు కేటాయించకుండా వివక్ష ప్రదర్శిస్తున్నారని ఎంపీ సోయం బాపూరావు ఆరోపించారు. మంగళవారం ఆయన బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌తో కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను పరిశీలించారు. వెనుకబడిన అదిలాబాద్ జిల్లాలో పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు కార్డియాలజీ, న్యూరాలజితోపాటు తొమ్మిది విభాగాలతో కూడిన ఆధునిక హంగులతో ఆస్పత్రి భవనానికి 150 కోట్లు […]
సారథిన్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రూ.2.20 కోట్లతో ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మున్సిపల్ చైర్మన్ కాపు సీతామహాలక్ష్మీ తదితరులు ఉన్నారు.
సారథిన్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ ప్రభుత్వంసంక్షేమంతోపాటు అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నదని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు పేర్కొన్నారు. మంగళవారం లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ పంచాయతీ పరిధిలోని జూబ్లీపురంలో రూ. 15 లక్షలతో సీసీరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, ఎంపీపీ భూక్య సోనా, సొసైటీ వైస్ చైర్మన్ జగన్, ఎంపీటీసీ స్వాతి , కొల్లు పద్మ, సర్పంచు బలరాం, టీఆర్ఎస్ నాయకులు వనమా […]