అవార్డు అందించిన కేంద్రమంత్రి మహేష్ శర్మ సామాజిక సారథి, హైదరాబాద్: ఉత్తమ డీసీసీబీ చైర్మన్‌గా చిట్టి దేవేందర్ రెడ్డి జాతీయ అవార్డును అందుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డీసీసీబీలో కెల్లా రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ మెరుగైన పనితీరుతో ఉత్తమ డీసీసీబీ చైర్మన్‌గా చిట్టి దేవేందర్ రెడ్డికి ఈ అవార్డు దక్కింది. గురువారం ఢిల్లీలోని కానిస్టిట్యూషనల్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర సాంస్కృతికశాఖ మంత్రి మహేష్ శర్మ చేతులమీదుగా చిట్టి దేవేందర్ […]
ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ లు, యూనిట్లు ఏర్పాటుకు ప్రోత్సాహం కూలీల సంక్షోభం పోవాలి.. యాంత్రీకరణ పెరగాలి నాబార్డ్ చైర్మన్, అధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు సూచించారు. వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం, నాబార్డు లాంటి సంస్థలు ప్రత్యేక ప్రణాళికలు అమలుచేయాలని కోరారు. నాబార్డ్ చైర్మన్ చింతల గోవిందరాజులు గురువారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను […]
నారాయణఖేడ్, సారథి న్యూస్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్ట్ జలకళను సంతరించుకున్నది. బుధవారం స్థానిక ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి నల్లవాగుకు పూజలు చేశారు. అనంతరం గేట్‌ను ఎత్తి నీటి విడుదల చేశారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్ రామ్ రెడ్డి, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ నరేందర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రమావత్ రాంసింగ్, ఎంపీపీ మహిపాల్ రెడ్డి, జెడ్పీటీసీ రాఘవరెడ్డి, కల్హేర్ జెడ్పీటీసీ నర్సింహా […]
సారథి న్యూస్, ఖమ్మం: డీసీసీబీ సహకార రుణాలను పెంచి.. సొసైటీలకు ఇవ్వాలని డీసీసీబీ చైర్మన్కూరాకుల నాగభూషయ్యను డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు కోరారు. బుధవారం ఖమ్మం డీసీసీబీ ఆఫీసులో చైర్మన్‌ను కలిసి రుణాల విషయమై చర్చించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 99 సొసైటీలకు రూ.50కోట్లు మంజూరు చేశారని, రుణాలు పొందని రైతులు ఎక్కువగా ఉండడంతో ఆ మొత్తం సరిపోవడం లేదని, సొసైటీలకు రుణాలు మంజూరు పెంచేలా చర్యలు చేపట్టామన్నారు. కొన్ని మండలాల్లో 4 నుంచి 5 […]
మంత్రికి తీర్మానపత్రం అందజేస్తున్న నస్కల్ గ్రామ రైతులు