సారథి న్యూస్, రామగుండం: అంబేద్కర్ యువజన సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, దళితనేత దివంగత మైసన్న సేవలు మరువలేనివరి దళితసంఘాల నాయకులు కొనియాడారు. సోమవారం గోదావరిఖని పట్టణంలోని తెలంగాణ అంబేద్కర్ భవన్లో మైసన్న వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ దళితసంఘాల నాయకులు పోగుల రంగయ్య, కొంకటి లక్ష్మణ్, మంతెన లింగయ్య. దుబాసి బొందయ్య, శంకర్, రామునాయక్, సిద్ధార్థ, శనిగరపు రామస్వామి. లచ్చులు, గంటయ్య, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.
సారథిన్యూస్, రామడుగు: అంబేద్కర్ ఇంటిపై దాడిచేయడమంటే దళితుల ఆత్మగౌరవంపై దాడిచేసినట్టేనని టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ వెన్న రాజమల్లయ్య పేర్కొన్నారు. అంబేద్కర్ నివాసం రాజగృహపై దాడిని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తున్నదని చెప్పారు. ఈ ఘటనపై ముంబై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ ఇంటిని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంకూరు మధు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సతీష్ డిమాండ్ చేశారు. […]
సారథిన్యూస్, రామగుండం: మాజీ ఉపప్రధాని జగ్జీవన్‌రామ్ సేవలు చిరస్మరణీయమని రామగుండం మున్సిపల్ చైర్మన్ ఉదయ్‌కుమార్ పేర్కొన్నారు. జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జగ్జీవన్‌రాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగ్జీవన్‌రామ్‌ను ఆదర్శంగా తీసుకొని దళితులు అన్నిరంగాల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఆల్ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంకూరి మధు, సంయుక్త కార్యదర్శి సతీశ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంతెన లింగయ్య, కాంగ్రెస్ నాయకుడు […]
విక్టరీ వెంకటేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న ‘నారప్ప’ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన ఓ పోస్టర్ యువతను తెగ ఆకట్టుకుంటున్నది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. తమిళంలో విజయవంతమైన ‘అసురన్’కు రీమేక్‌గా ఈ చిత్రం వస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో ధనుష్ నటించిన ఈ సినిమా అక్కడ భారీవిజయాన్ని సొంతం చేసుకున్నది. దళితుడి జీవితానికి సంబంధించిన కథతో ఈ చిత్రం తెరకెక్కింది. తమిళ మాతృకకు వెట్రిమారన్ దర్శకత్వం వహించాడు. […]
సారథి న్యూస్, రామాయంపేట: కూలీలుగా ఉన్న దళితులు రైతులుగా ఎదగాలని, ఆత్మగౌరవంతో జీవించాలని దళిత బహుజన రిసోర్స్ సెంటర్ (డీబీఆర్సీ) రాష్ట్ర సమన్వయ కర్త పీ శంకర్ పేర్కొన్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడలో దళిత మహిళా రైతులకు వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం పంపిణీ చేసిన మూడెకరాలు తీసుకున్న దళితులు ఆహార పంటలను పండించి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో డీబీఅర్సీ మెదక్ జిల్లా కో ఆర్డినేటర్ దుబాషి సంజీవ్, పరశురాములు, దేవరాజు, స్వామి, […]