న్యూఢిల్లీ: పార్లమెంట్‌పై దాడి జరిగి ఆదివారంతో 19 ఏళ్లు పూర్తవుతున్న క్రమంలో నాటి ముష్కరుల దుశ్చర్యను గుర్తు చేసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. పార్లమెంట్‌పై దుండగుల దాడిని ఎప్పటికీ మరువలేమన్నారు. జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ట్వీట్‌చేశారు.2001 డిసెంబర్13న సాయుధ ఇస్లామిక్ ఉగ్రవాదులు భారత పార్లమెంట్‌పై దాడి చేశారు. వారిని భద్రతా దళాలు సమర్థవంతంగా ఎదుర్కొని, దాడిలో పాల్గొన్న మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు ఢిల్లీ పోలీసులు, ఒక సీఆర్పీఎఫ్మహిళతో పాటు ఇద్దరు పార్లమెంట్ […]
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రమూకలు రెచ్చిపోతున్నాయి. స్థానికుల అండదండలతో చెలరేగిపోతున్నాయి. తాజాగా శ్రీనగర్‌లోని పంతాచౌక్ వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ దళాలపై ఉగ్రమూక ఒక్కసారిగా దాడులకు తెగబడింది. వెంటనే అలర్టయిన జవాన్లు ఎదురుదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. మరోవైపు సీఆర్పీఎఫ్కు చెందిన ఓ అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ ఘటనతో శ్రీనగర్ అట్టుడుకింది. ఇరు వర్గాలు దాదాపు గంటపాటు ఫైరింగ్ చేసుకున్నట్టు సమాచారం.
సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వెంకటాపురం మండలం సీఆర్పీఎఫ్ 141వ బెటాలియన్ కమాండెంట్ శ్రీహరిఓం ఖరే ఆధ్వర్యంలో ఆదివారం వెంకటాపురం మండలంలోని మంగవాయ, లక్మిపురం, పాత్రపురం గ్రామాల్లో 6వ విడత హరితహారం కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. సీఆర్పీఎఫ్ఆఫీసర్ కమాండింగ్ ఎస్సై సీతారాం సింగ్, సీఐ శివప్రసాద్, ఎస్సై తిరుపతి, సీఆర్పీఎఫ్ఎస్సై అలెగ్జాండర్ డేవిడ్, ఎస్సై రాంప్రసాద్ పాల్ మొక్కలు నాటారు. హరితహారం కార్యక్రమం ప్రాధాన్యతను వివరించారు. సర్పంచ్ కృష్ణార్జునరావు, ఉపసర్పంచ్ మల్లికార్జున రావు, టీచర్ పాండా […]
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో బుధవారం టెర్రరిస్టులు జరిపిన దాడిలో ఒక సీఆర్‌పీఎఫ్ జావాన్, ఓ పౌరుడు చనిపోయారు. పెట్రోల్ పార్టీ టీమ్‌పై టెర్రరిస్టులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్‌లో చేర్పించి ట్రీట్‌మెంట్ ఇస్తుండగా.. ఒక జవాను అమరుడైనట్లు అధికారులు చెప్పారు. మరోవైపు ఫ్యామిలీతో అటుగా వెళ్తున్న వ్యక్తికి బుల్లెట్లు తగలడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడన్నారు. కారులో వచ్చిన టెర్రరిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపి పారిపోయారని, వారి […]
కశ్మీర్: హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ మసూద్ అహ్మద్ భట్ భద్రతా దళాలు చేతిలో హతమయ్యాడు. దక్షిణ కశ్మీర్ జిల్లాలోని కుల్‌చోరాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అహ్మద్ భట్‌తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో దోడా ఇక ‘ఉగ్రవాదరహిత’ జిల్లాగా మారినట్లు అధికారులు ప్రకటించారు. ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయని తెలిపారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి ఓ ఏకే రైఫిల్, రెండు తుపాకులు స్వాధీనం […]