మానోపాడు: ఒకవైపు కరోనా మహమ్మారి ఇంకా ప్రబలుతుంటే కొందరేమో సామాజిక దూరం, మాస్కు ధరించకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానోపాడు మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు దగ్గర బ్యాంకు రుణాలపై మహిళా సంఘాలకు, సమైక్య అధికారులు ఎస్బీఐ బ్యాంక్ సిబ్బంది అవగాహన కల్పించారు. అయితే ఈ సమావేశానికి100 మంది దాకా హాజరయ్యారు. అయితే వారేవరూ మాస్కు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడంతో విమర్శలు వస్తున్నాయి.
సారథిన్యూస్, సూర్యాపేట: భారత్-చైనా సరిహద్దులో మాతృభూమి కోసం ప్రాణలర్పించిన సంతోష్‌బాబుకు యావత్ భారతావని కన్నీటి వీడ్కోలు పలికింది. సూర్యాపేట సమీపంలోని కేసారంలో సైనికలాంచనాల నడుమ సంతోష్‌బాబుకు అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమయాత్రలో భారీగా ప్రజలు పాల్గొన్నారు. ఆర్మీ జవాన్లు వీరజవానుకు నివాళిగా మూడుసార్లు గాల్లోకి కాల్పులు జరిపారు. తండ్రి సురేశ్‌బాబు చితికి నిప్పంటించారు. రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి సంతోష్‌బాబు పార్థివదేహం వద్ద నివాళి అర్పించారు.