Breaking News

CM KCR

భిక్షమెత్తి గురుకులాలను నడిపించా..

గురుకులాల కోసం భిక్షమెత్తాల్సి వచ్చేది..!

సామాజిక సారథి, హైదరాబాద్ ​ప్రతినిధి: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకులాలను నడిపించేందుకు ప్రభుత్వం సరైన బడ్జెట్ ​ఇవ్వలేదు.. ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్​ వద్ద భిక్ష అడగాల్సి వచ్చేదని గురుకులాల పూర్వ కార్యదర్శి, బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్​ డాక్టర్ ​ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్ గుర్తుచేసుకున్నారు. నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని చెప్పుకొచ్చారు. అయినా కూడా ప్రభుత్వం ఇచ్చిన ఒక్కోరూపాయిని జాగ్రత్తగా ఖర్చుపెడుతూ పేదవర్గాల బిడ్డలకు నాణ్యమైన చదువులు అందించగలిగామని వివరించారు. టీఆర్ఎస్ ​నాయకులు, ముఖ్యమంత్రి, ప్రభుత్వం గురుకులాలకు ఏదో చేశామని, అహో, […]

Read More
యాదగిరీశుడికి ఎమ్మెల్యే మర్రి ‘బంగారు’ కానుక

యాదగిరీశుడికి ఎమ్మెల్యే మర్రి ‘బంగారు’ కానుక

సామాజిక సారథి, నాగర్​కర్నూల్ ​ప్రతినిధి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ విమాన గోపురం స్వర్ణం తాపడానికి నాగర్​కర్నూల్​ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్​రెడ్డి రెండు కేజీల బంగారాన్ని శుక్రవారం ఆలయ ఈవో గీతారెడ్డికి అందజేశారు. తెలంగాణ కళావైభవం చాటేలా, ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. గతంలో ఆయన సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ముందుకొచ్చి.. తాజాగా రెండు కేజీల బంగారాన్ని అందజేశారు. నారసింహుడి ఆలయాన్ని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్​రెడ్డి కుటుంబసమేతంగా […]

Read More
కూచకుళ్ల, కసిరెడ్డి నామినేషన్​

కూచకుళ్ల, కసిరెడ్డి నామినేషన్​

సామాజిక సారథి, నాగర్​కర్నూల్ ​ప్రతినిధి/ కల్వకుర్తి: ఉమ్మడి మహబూబ్​నగర్ ​జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్​ నేత, సిట్టింగ్​ ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​రెడ్డి మంగళవారం మధ్యాహ్నం నామినేషన్ ​వేశారు. నామినేషన్​ పత్రాలను మహబూబ్​నగర్ జిల్లా కలెక్టర్ ​ఎస్.వెంకట్రావు కు అందజేశారు. ఆయన వెంట మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, నాగర్​కర్నూల్​ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్​రెడ్డి వెళ్లి స్వయంగా నామినేషన్​ పత్రాలను కలెక్టర్​కు అందజేశారు. మరో అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా నామినేషన్​ వేశారు. ఆయన వెంట […]

Read More
బండి సంజయ్.. గోబ్యాక్ !

బండి సంజయ్.. గోబ్యాక్ !

నల్లగొండలో టీఆర్ఎస్ కార్యకర్తల నిరసన గులాబీ, కమలం శ్రేణుల బాహాబాహీ ఇరుపార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లదాడి ధాన్యం కుప్పలపై పరుగులు.. చెల్లాచెదురైన వడ్లు సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలనలో భాగంగా సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రానికి సమీపంలోని ఆర్జాలబావి ఐకేపీ సెంటర్​కు చేరుకున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు బండి సంజయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ‘బండి సంజయ్ […]

Read More
ఎమ్మెల్సీ రేసులో వెంకట్రామిరెడ్డి

ఎమ్మెల్సీ రేసులో వెంకట్రామిరెడ్డి?

సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: సిద్దిపేట కలెక్టర్​ వెంకట్రామిరెడ్డి వీఆర్​ఎస్​ తీసుకున్నారు. టీఆర్​ఎస్​ నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశమిస్తానని సీఎం కేసీఆర్ ​నుంచి గ్రీన్​సిగ్నల్​ కావడంతో ఆయన తన కలెక్టర్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎస్​ సోమేశ్​కుమార్​కు పంపించగా ఆయన ఆమోదించారు. ఇదిలాఉండగా, కొద్దిసేపటల్లో టీఆర్ఎస్​లో చేరనున్నట్లు సమాచారం. వెంకట్రామిరెడ్డి స్వస్థలం పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామం. 1996లో డిప్యూటీ కలెక్టర్ ​కేడర్​లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. ఉమ్మడి […]

Read More
హుజూరాబాద్​ఓటమితో టీఆర్ఎస్ అలర్ట్

హుజూరాబాద్​ ఓటమితో టీఆర్ఎస్ అలర్ట్

సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: హుజూరాబాద్ ఉపఎన్నిక ఫ‌లితం అధికార టీఆర్ఎస్‌కు ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల‌ను తెచ్చిపెట్టింది. సీఎం కె.చంద్రశేఖర్​రావు ఈ ఎన్నిక‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించారు. ట్రబుల్ ​షూట‌ర్, మంత్రి టి.హ‌రీశ్‌రావు దీన్ని ఒక స‌వాల్‌గా తీసుకుని ప‌నిచేశారు. అయినా ఫ‌లితం తారుమారు కావడంతో వారు కొంత నైరాశ్యానికి గురైన‌ట్లు తెలిసింది. అందులోనూ 23వేల పైచిలుకు మెజారిటీతో ఈట‌ల రాజేందర్​ గెల‌వ‌డాన్ని వారు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ ఉపఎన్నిక ఫ‌లితాలు వెలువ‌డిన అనంత‌రం పార్టీకి […]

Read More
‘ఓట్ల కోసమే దళితబంధు’

‘ఓట్ల కోసమే దళితబంధు’

సామాజిక సారథి, పెద్దశంకరంపేట: రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో దళితబంధు పథకం అమలు చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు సురేష్ షెట్కార్ అన్నారు. మెదక్​జిల్లా పెద్దశంకరంపేట మండలం గొట్టిముక్కల, పెద్దశంకరంపేట ఎస్సీకాలనీల్లో దళిత గిరిజన దండోరా కార్యక్రమంలో భాగంగా సభ ఏర్పాటుచేశారు. సీఎం కేసీఆర్ కేవలం ఎన్నికల కోసమే హుజరాబాద్ లో దళితబంధు పథకం ప్రవేశ పెట్టారని విమర్శించారు. దళిత బంధు పథకాన్ని రాష్ట్రమంతటా వర్తింప చేయాలని ఆయన అన్నారు. ఇంటికో ఉద్యోగం అన్న సీఎం కేసీఆర్ ఊరికొక ఉద్యోగం […]

Read More
బసవేశ్వర, సంగమేశ్వర లిఫ్టులపై సీఎం రివ్యూ

బసవేశ్వర, సంగమేశ్వర లిఫ్టులపై సీఎం రివ్యూ

సామాజిక సారథి, పెద్దశంకరంపేట: ఢిల్లీలోని ముఖ్యమంత్రి రెసిడెంట్ భవనంలో నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాలకు వరప్రదాయిని అయిన బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలపై ఇరిగేషన్ శాఖ అధికారులతో సీఎం కేసీఆర్​సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు బీబీ పాటిల్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి, ఆందోల్, జహీరాబాద్ శాసనసభ్యులు సి.క్రాంతికిరణ్, మానిక్ రావు పాల్గొన్నారు.

Read More