Breaking News

CM KCR

ఎమ్మెల్సీ సంబరాల్లో తుపాకీ కలకలం

ఎమ్మెల్సీ సంబరాల్లో తుపాకీ కలకలం

హైదరాబాద్​: నల్లగొండ, హైదరాబాద్​ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్​రెడ్డి, సురభి వాణీదేవి ​ఘనవిజయం సాధించారు. టీఆర్ఎస్ ​శ్రేణుల సంబరాల్లో భాగంగా బాణాసంచా కాల్చడంతో తెలంగాణ భవన్ ​కప్పుకు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. ప్రమాదం తప్పింది. శనివారం సాయంత్రం టీఆర్ఎస్ ​నేత ఒకరు తుపాకీతో హల్​చల్​ సృష్టించాడు. ఆ పార్టీలో యూత్​వింగ్ ​లీడర్​ కట్టెల శ్రీనివాస్ ఒక్కసారిగా తుపాకీ తీసి పైకి ఎత్తిపట్టడంతో సమీపంలోని కార్యకర్తలు, నాయకులు హతాశులయ్యారు. వెంటనే తుపాకీని దాచిపెట్టాడు. […]

Read More
మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం అభినందనలు

మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం అభినందనలు

హైదరాబాద్​: ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను ఆదివారం మంత్రులు, ఎమ్మెల్యేలు కలిశారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించినందుకు వారిని ఆయన అభినందించారు. సీఎంను కలిసిన వారిలో మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎంపీలు పసునూరి దయాకర్, బడుగుల లింగయ్య యాదవ్, […]

Read More
మొక్కబడి మీటింగ్​లు ఎందుకు?

మొక్కబడి మీటింగ్​లు ఎందుకు?

ఆగ్రహం వ్యక్తంచేసిన సభ్యులు ఎంపీటీసీల పాత్ర ఉత్సవ విగ్రహాలే హాజరుకాని అధికారులపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు సారథి న్యూస్​, మానవపాడు: రేషకార్డులు రాలే, మూడేళ్లు గడిచినా ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు కాకపోతే గ్రామాల్లో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఉండి ఏమి చేయాలని ఎంపీపీ కోట్ల అశోక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి మూడునెలలకు ఒకసారి జరిగే సర్వసభ్య సమావేశం ఎందుకోసమని, సమావేశానికి హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ […]

Read More
రెగ్యులరైజేషన్​పై పంచాయతీ కార్యదర్శుల హర్షం

రెగ్యులరైజేషన్​పై పంచాయతీ కార్యదర్శుల హర్షం

సారథి న్యూస్​, పెద్దశంకరంపేట: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ప్రొఫెషనల్ సమయాన్ని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించడంతో పాటు రెగ్యులర్ చేసేందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించడంపై మండల జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇటీవల జరిగిన ఉద్యోగ సంఘాల భేటీలో ముఖ్యమంత్రి తమ సమస్యలపై స్పందించడంతో వారు హర్షం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా నాయకులు నరసింహాగౌడ్, పంచాయతీ కార్యదర్శులు ప్రభాకర్ రమేష్ మహిపాల్ పాల్గొన్నారు.

Read More
మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి

మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: ప్రస్తుత పోటీ ప్రపంచంలో మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం పెద్దశంకరంపేట పీఆర్టీయూ మండల శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయినులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ మహిళా దేశానికి ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. మంచి అవకాశాలు కల్పిస్తే మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తారని అన్నారు. ఆడబిడ్డల వివాహానికి సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి ద్వారా రూ.లక్ష అందిస్తున్నారని […]

Read More
శోభక్క నోటికొచ్చినట్లు మాట్లాడకు..

శోభక్క నోటికొచ్చినట్లు మాట్లాడకు..

సారథి న్యూస్, చొప్పదండి: చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికాదని రామడుగు మండల టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కల్గెటి లక్ష్మణ్ ఆక్షేపించారు. స్థాయి తగ్గి మాట్లాడొద్దని హితవుపలికారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ పెట్టిన భిక్షతో శోభ జడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా గెలుపొంది, ఇప్పుడు టికెట్​ రాకపోయే సరికి బీజేపీలో చేరి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. గతంలో సీఎం […]

Read More
యువకుల్లో నైపుణ్యం వెలికితీయాలి

యువకులను అన్నిరంగాల్లో ప్రోత్సహించాలి

సారథి న్యూస్, రామాయంపేట: గ్రామాల్లోని చాలా మంది యువకుల్లో రకరకాల నైపుణ్యం ఉన్నప్పటికీ గుర్తించే వ్యవస్థ లేకపోవడంతో వారు అక్కడే ఉండిపోతున్నారని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి అన్నారు. ఆదివారం మెదక్​ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన జట్లకు ప్రైజ్ మనీ అందజేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామాల్లో ఇలాంటి టోర్నీలను నిర్వహించడం ద్వారా యువకుల నైపుణ్యం బయటకు […]

Read More
ఏం చేశారని ఓటు వేయాలి

ఏం చేశారని ఓటు వేయాలి?

సారథి న్యూస్, శంషాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు ఇస్తే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని మంత్రి టి.హరీశ్​రావు డిమాండ్​ చేశారు. ఇంధనం, గ్యాస్ ధరలు అధికంగా పెంచుతూ పేదల నడ్డి విరుస్తుందని విమర్శించారు. శుక్రవారం శంషాబాద్ లోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజకవర్గ పట్టభద్రులుగా ఎమ్మెల్సీ సురభివాణి దేవిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. […]

Read More