Breaking News

CHEQES

తెలంగాణ పథకాలు.. దేశానికే ఆదర్శం

సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణ రాష్ట్రంలో పేదల ప్రభుత్వం కొనసాగుతున్నదని మెదక్​ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. మంగళవారం మెదక్​ జిల్లా నిజాంపేట, రామాయంపేట మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్యణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు టీఆర్​ఎస్​ నేతలు పాల్గొన్నారు.

Read More

కల్యాణ లక్ష్మి పేదలకు వరం

సారథి న్యూస్​, పెద్దశంకరంపేట: సీఎం కేసీఆర్​ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మి పథకం నిరుపేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన పెద్దశంకరంపేట మండలం బుజరంపల్లి, గోపని వెంకటాపూర్​, టెంకటి గ్రామాలకు చెందిన 15 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ పేదప్రజల పక్షానే ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో పలువురు టీఆర్​ఎస్​ కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More
సీఎం రిలీఫ్​ఫండ్​ చెక్కుల పంపిణీ

సీఎం రిలీఫ్​ఫండ్​ చెక్కుల పంపిణీ

సారథిన్యూస్, చిన్నశంకరంపేట: మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు సోమవారం టీఆర్​ఎస్​ పార్టీ మండల అధ్యక్షుడు పట్లోరి రాజు సీఎం రిలీఫ్​ఫండ్​ చెక్కులను పంపిణీ చేశారు. 32 మంది లబ్ధిదారులకు రూ. 8 లక్షల 45 వేల చెక్కులను అందజేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు.. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన సర్పంచులు, నాయకులు రమేశ్​గౌడ్, బండారు స్వామి తదితరులు పాల్గొన్నారు.

Read More