సామాజిక సారథి, చేగుంట: అన్నదాతలు అధైర్యపడొద్దు ప్రతి గింజ కొంటామని ఎమ్మెల్సీ ఫరక్ హుస్సేన్ అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ యార్డులు, గ్రామీణ ప్రాంతాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతుల నుంచి ధాన్యాన్ని తీసుకుంటుందని చెప్పారు. సీఎం కేసీఆర్ రైతుల అభ్యున్నతి కోసం రూ. 2060 మద్దతు ధర కల్పిస్తున్నాడని […]
సామాజిక సారథి, తిమ్మాజిపేట: నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని చేగుంట గ్రామంలో శనివారం రాత్రి కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన పలువురు యువకులు ఉట్టికొట్టారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు మారేపల్లి సురేందర్ రెడ్డి. సర్పంచ్ బి.లావణ్య, ఎంపీటీసీ సభ్యుడు పిల్లమల్ల మల్లయ్య, పలువురు గ్రామపెద్దలు పాల్గొన్నారు.
సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పాటు కానుంది. వెల్దుర్తి మండలంలోని మాసాయిపేట కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ బుధవారం ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశారు. వెల్దుర్తి మండలంలోని 6 గ్రామాలు, చేగుంట మండలంలోని 3 గ్రామాలను కలిపి కొత్త మండలం ఏర్పాటు కానుంది. గతనెల 25న హరిత హారం కార్యక్రమ ప్రారంభం కోసం సీఎం కేసీఆర్ నర్సాపూర్ కు వచ్చిన సందర్భంగా […]