సామాజికసారథి, హైదరాబాద్: గత మే నెలలో నిర్వహించిన TSWRJC & COE CET-2022 ప్రవేశపరీక్ష Phase-2 ఫలితాలు వెలువడ్డాయి. మొదటి దశలో సీటు రాని వారు 2వ దశలో మీ ఫలితం చూసుకోవచ్చు. అలాగే ఈనెల 10న సాధారణ గురుకులాల కాలేజీలకు రాసిన ప్రవేశపరీక్షల ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటించారు. https://tsswreisjc.cgg.gov.in
జాక్ డోర్స్ స్థానంలో నియామకం పరాగ్‌కు అభినందనలు తెలిపిన కేటీఆర్ న్యూయార్క్: మొన్న మైక్రోసాప్ట్.. నిన్న గూగుల్.. నేడు ట్విట్టర్.. గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజాలు వరుసగా భారతీయుల సారథ్యంలోకి వస్తున్నాయి. ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ పగ్గాలు భారత సంతతి టెక్కీ చేతికి వచ్చాయి. ట్విట్టర్ కొత్త సీఈవోగా పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. సీఈవోగా ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే సోమవారం దిగిపోవడంతో ఆయన స్థానంలో చీఫ్ టెక్నికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పరాగ్ అగర్వాల్‌ను […]
సారథిన్యూస్, హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసింది. టీవీ9 సంస్థనుంచి ఆయన భారీగా నిధులను విత్‌డ్రా చేసుకున్నట్టు ఈడీ గుర్తించింది. దాదాపు 18 కోట్ల రూపాయలను రవిప్రకాశ్, మరో ఇద్దరు వ్యక్తులు విత్‌డ్రా చేసినట్టు కేసు నమోదు కావడంతో ఈడీ విచారణ చేపట్టింది. 18 కోట్లను ఆయన ఎక్కడికి తరలించారన్న అంశంపై ఈడీ విచారణ జరుపుతున్నది. ఈ కేసులో రవిప్రకాశ్ ఏ1గా ఉన్నారు.