హైదరాబాద్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ప్రస్తుతం ఏసీబీ అదుపులో ఉన్న కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఓ భూ వివాదంలో నాగరాజు రూ. కోటి పదిలక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అయితే నాగరాజు ప్రస్తుతం చెంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జైలు గదిలో ఆయన ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్టు జైలు అధికారులు తెలిపారు.
సారథిన్యూస్, నల్లగొండ : నకిలీ విత్తనాల కేసులో కర్నూలు జిల్లాకు చెందిన కర్నాటి మధుసూదన్‌రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు చండూర్ సీఐ సురేష్ కుమార్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం భారీగా నకిలీ పట్టివిత్తనాలు పట్టుకున్న నల్లగొండ జిల్లా పోలీసులు కేసులో విచారణ పూర్తి చేసి ఎస్పీ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు.. సీఐ సురేష్ కుమార్ శనివారం మధుసూదన్‌రెడ్డిని వరంగల్ కు తరలించారు. నల్లగొండ కలెక్టర్ ఆదేశాల మేరకు […]