Breaking News

CAROONA

కరోనా రికార్డు

సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. కొత్త ప్రాంతాలకు చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొత్త వ్యక్తులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో శనివారం మొదటిసారి కొత్తగా 546 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే 458 కేసులు పాజిటివ్​గా తేలాయి. ఒకేరోజు కరోనాతో ఐదుగురు మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 203కు చేరింది. రాష్ట్రంలో కేసులు 7072కు చేరాయి. ఇప్పటివరకు 53,757 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. 3,363 మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స […]

Read More

కరోనా మందు వచ్చేసింది

ముంబై: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ నియంత్రణకు ఔషధం సిద్ధమైంది. భారత ఫార్మాదిగ్గజ కంపెనీ గ్లెన్‌ మార్క్‌ కరోనా నివారణ మందును ఆవిష్కరించినట్టు వెల్లడించింది. ఇప్పటికే మూడు దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తిచేసినట్లు తెలిపింది. ఫవిపిరవిర్‌, ఉమిఫెనోవిర్‌ అనే రెండు యాంటీ వైరస్‌ ఔషధాలపై అధ్యయనం చేసిన గ్లెన్‌మార్క్‌ ఫవిపిరవిర్‌ ఔషధం కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్న వారిపై బాగా పనిచేస్తోందని వెల్లడించింది. ఫాబిఫ్లూ బ్రాండ్‌ పేరిట ఈ ఔషధాన్ని మార్కెట్​లోకి విడుదల చేసేందుకు […]

Read More

కరోనాకు ఆరోగ్యశ్రీ వైద్యం

సారథి న్యూస్, హుస్నాబాద్: కరోనా పేషంట్లకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యమందించాని టీపీసీసీ కార్యదర్శి బొమ్మ శ్రీరాం చక్రవర్తి డిమాండ్​ చేశారు. శుక్రవారం ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ 50వ జన్మదిన వేడుకల్లో మాట్లాడారు. ప్రపంచ మహమ్మారి కరోనా వైరన్ రోజురోజుకు విజృంభిస్తోందని దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుందని కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేసిన పట్టించుకోలేదన్నారు. ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని […]

Read More

ఒకేరోజు 302 కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో గురువారం రికార్డు స్థాయిలో 352 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతిచెందారు. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 302 కేసులు ఉన్నాయి. మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 6,027కు చేరింది. గురువారం ముగ్గురు కరోనాతో మృతిచెందడంతో మొత్తం మృతుల సంఖ్య 195గా నమోదైంది. ఇప్పటివరకు వివిధ ఆస్పత్రుల్లో కరోనా నుంచి కోలుకున్న 3,301 మంది డిశ్చార్జ్​ అయ్యారు. మేడ్చల్​ జిల్లాలో 10, […]

Read More

టీబీ నిర్ధారణ టెస్టులు

సారథి న్యూస్, వాజేడు(ములుగు): వాజేడు హెల్త్​ సెంటర్​లో క్షయ వ్యాధిగ్రస్తుల నుంచి క్షయవ్యాధి(టీబీ) నిర్ధారణ కోసం వైద్యాధికారుల బృందం తెమడను సేకరించింది. బాధితులకు వ్యాధి లక్షణాలను తెలియజేశారు. అనంతరంపై కరోనాపై జాగ్రత్తలను వివరించారు. తప్పనిసరిగా మాస్కులు కట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. డాక్టర్​ యమున, కోటిరెడ్డి, ఈశ్వరమ్మ, శరత్ బాబు, రవి, రజినీకాంత్, శేఖర్ పాల్గొన్నారు.

Read More

కేసులు 200 పైనే..

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో మంగళవారం కొత్తగా 213 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యారు. మహమ్మారి బారినపడి నలుగురు మృతిచెందారు. ఇప్పటివరకు 191 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 5,406కి చేరింది. 3,027 మంది డిశ్చార్జ్​ అయ్యారు. రాష్ట్రంలో ప్రసుత్తం 2,188 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొత్తగా వచ్చిన కేసుల్లో అత్యధికంగా 165 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. జిల్లాల వారీగా అత్యధికంగా మెదక్‌ 13, కరీంనగర్‌ 6, మేడ్చల్‌లో 3 కేసులు నిర్ధారణ అయ్యాయి. […]

Read More

మెదక్​లో కరోనా పంజా

సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలో కరోనా పంజా విసురుతోంది. మూడు నెలల్లో 14 నమోదు కాగా, మంగళవారం ఒకేరోజు 14 మందికి పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. పదిరోజుల్లో మెదక్, రామాయంపేట, తూప్రాన్, చేగుంట, కొండపాకకు చెందిన పలువురికి కరోనా వైరస్​ సోకింది. ఈ క్రమంలో వైద్యారోగ్యశాఖ అధికారులు పాజిటివ్ నిర్ధారణ అయిన వారి ప్రైమరీ కాంటాక్ట్ మెంబర్ల శాంపిళ్లను సేకరించి టెస్టుకు పంపించారు. మంగళవారం 14మందికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయింది. మెదక్ పట్టణం […]

Read More

కరోనా టెస్టు​కు రూ.2,200

సారథి న్యూస్​, హైదరాబాద్‌: ప్రైవేట్​ ఆస్పత్రుల్లో కరోనా నిర్ధారణ టెస్టు రేటును రూ.2,200గా నిర్ణయించినట్లు మంత్రి ఈటెల రాజేందర్​ తెలిపారు. ఒక్కోరోజుకు వెంటిలేటర్‌పై లేకుండా ఐసీయూలో ఉంచితే రూ.7,500, వెంటిలేటర్‌పై ఉంచితే రూ.9వేలు ఛార్జీ వసూలు చేస్తారని చెప్పారు. కరోనాపై ఉన్నతస్థాయిలో నిత్యం సమీక్ష చేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణలో కరోనా సామాజిక వ్యాప్తి లేదని ఐసీఎంఆర్‌ చెప్పిందన్నారు. కరోనా లక్షణాలు లేనివారికి పరీక్షలు చేయబోరని, లక్షణాలు ఉన్నవారికే టెస్టు​లు చేయాలని మార్గదర్శకాలు ఇస్తున్నామని మంత్రి ఈటల చెప్పారు.

Read More