Breaking News

CARONA

12వేలకు చేరిన మృతులు

ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నది. గత 24 గంటల్లో 176 మంది కరోనాతో మృతిచెందగా.. మొత్తం మృతుల సంఖ్య 12,030కి చేరింది. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు 3,18,695 మందికి కరోనా సోకింది. గత 24 గంటల్లో 8,240 కొత్త కేసులు నమోదయ్యాయి. 1,75,029 మంది కోలుకున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. దేశంలో అత్యధిక కేసులో మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి.

Read More
రాష్ట్రంలో హెల్త్​ ఎమర్జెన్సినీ ప్రకటించాలి

హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి

సారథి న్యూస్, రామడుగు: ప్రస్తుతపరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో హెల్త్​ఎమర్జెన్సీని ప్రకటించాలని కరీంనగర్ జిల్లా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ డిమాండ్​ చేశారు. ప్రైవేట్​, కార్పొరేట్​ ఆస్పత్రులను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని కోరారు. సోమవారం కరీంనగర్ జిల్లా రామడుగు అంబేద్కర్​ చౌరస్తాలో సీపీఐ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో ఉమ్మెంతుల రవీందర్ రెడ్డి, మచ్చ రమేశ్​, ఏగుర్ల మల్లేశ్, వేముల మల్లేశం, పారునంది మొండయ్య,ఉమ్మెంతుల రాజిరెడ్డి,రఫిక్ తదితరులు పాల్గొన్నారు.

Read More

ఖమ్మంలో యాంటీజెన్​ టెస్టులు

సారథిన్యూస్​, ఖమ్మం: రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఖమ్మంలో రాపిడ్​ యాంటిజెన్​ టెస్టులు చేస్తున్నారు. సోమవారం మంత్రి పువ్వాడ అజయ్​ ఖమ్మంలో ర్యాపిడ్​ యాంటిజెన్​ టెస్టుల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాకు 10 వేల ర్యాపిడ్ యాంటీజేన్ టెస్ట్ కిట్స్ అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి ఉన్న వారు టెస్టులు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్​ ఆర్వీ […]

Read More
తెలంగాణలో 1,198 కేసులు

తెలంగాణలో 1,198 కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సోమవారం 1,198 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తంగా 46,274 పాజిటివ్ ​కేసులు నిర్ధారణ అయ్యాయి. ఒకేరోజు ఏడుగురు మృత్యువాతపడ్డారు. ఇప్పటిదాకా మృతిచెందిన వారి సంఖ్య 415కు చేరింది. ఇప్పటివరకు 11,003 శాంపిళ్లను పరీక్షించారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా జీహెచ్​ఎంసీ పరిధిలో 510 పాజిటివ్​కేసులు నిర్ధారణ అయ్యాయి. రంగారెడ్డి 106, మేడ్చల్​76, సంగారెడ్డి 10, వరంగల్​అర్బన్​73, కరీంనగర్​87, జగిత్యాల 36, మహబూబాబాద్ 36, మెదక్​13, మహబూబ్​నగర్​50, భూపాలపల్లి […]

Read More

ఐశ్వర్య అర్జున్​కు కరోనా

సీనియర్ నటుడు అర్జున్ కూతురు, నటి ఐశ్వర్య అర్జున్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఐశ్వర్య సోషల్‌ మీడియాలో వెల్లడించారు. తనతో కాంటాక్ట్ అయిన వారు కూడా కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. ఇక ఐశ్వర్య 2013లో హీరోయిన్‌గా తెరంగేట్రం చేశారు. ఆమె ప్రస్తుతం హోంఐసోలేషన్​ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అందరూ తప్పని సరిగా మాస్క్‌ ధరించాలని చెప్పారు. తన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు త్వరలో అందరితో […]

Read More

కోలుకున్న ఢిల్లీ మంత్రి

ఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్రజైన్​ కరోనా నుంచి కోలుకున్నారు. ‘ఆరోగ్యమంత్రి సత్యేంద్ర ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్నారు. సోమవారం నుంచే అయన విధుల్లో చేరతారు. మళ్లీ ఆయన దవాఖానలు సందర్శిస్తారు. కరోనాపై వైద్యశాఖ అధికారులతో సమావేశమవుతారు’ అని ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ ట్వీట్​చేశారు. కాగా ప్లాస్మాథెరపీ తీసుకోవడం వల్లే ఆయన కోలుకున్నారని వైద్యులు చెప్పారు.

Read More
దేశంలో పెరుగుతున్న కేసులు

24 గంటల్లో 40 వేల కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది. గడిచిన 24 గంటల్లో 2,56,039 శాంపిల్స్‌ పరీక్షించగా.. వాటిల్లో 40, 421 పాజిటివ్‌గా తేలాయి. వైరస్‌ బారిన పడి 681 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,18,043కి చేరుకుంది. మృతుల సంఖ్య 27,497కి పెరిగింది. ఇక దేశ వ్యాప్తంగా 1265 ల్యాబ్స్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి ఆరా తీశారు. వివిధ రాష్ట్రాల […]

Read More

మరో ఎమ్మెల్యేకు కరోనా

సారథిన్యూస్​, హైదరాబాద్‌ : తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా సోకింది. కుత్బుల్లాపూర్​ ఎమ్మెల్యే వివేకానందగౌడ్​కు కరోనా సోకినట్టు సమాచారం. ఆయన భార్య సౌజన్య, కుమారుడు విధాత్‌లకు సైతం కోవిడ్‌ సోకినట్లు ఆదివారం వైద్యులు వెల్లడించారు. ఎమ్మెల్యే కుటుంబసభ్యులు ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల ఎమ్మెల్యే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడే ఎమ్మెల్యేకు కరోనా సోకి ఉంటుందని ఆయన కుటుంబసభ్యలు తెలిపారు. కాగా ప్రస్తుతం ఎమ్మెల్యే ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని.. లక్షణాలు కూడా ఎక్కువగా లేవని […]

Read More