Breaking News

CARONA

మహారాష్ట్రలో పోలీసులకు కరోనా

138 మంది పోలీసులకు కరోనా

ముంబై: మహారాష్ట్రలో గత 24 గంటల్లో 138 మంది పోలీసులకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో పోలీస్​శాఖలో 8,722 మందికి కరోనా సోకింది. ఇందులో 6,670 మంది పోలీసులు కోలుకోగా మరో 1,955 యాక్టివ్​ కేసులున్నాయి. ఇప్పటివరకు 97 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీస్​శాఖ అధికారులు చెప్పారు.

Read More
ముంబైలో కరోనా తగ్గుముఖం

ముంబైలో కరోనా తగ్గుముఖం

ముంబై: దేశ ఆర్థికరాజధాని ముంబైలో కరోనా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కేవలం 700 కేసులు మాత్రమే నమోదయ్యాయి. గత మూడు నెలల నుంచి ఇంత తక్కువస్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. ‘ఇది చాలా సంతోషిదగ్గ విషయం. అయినప్పటికీ ప్రజలు జాగ్రత్తగానే ఉండాలి, మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. అదేసమయంలో భౌతికదూరం పాటించాలి’ అంటూ ఆ రాష్ట్ర మంత్రి ఆధిత్యథాక్రే ట్వీట్​ చేశారు.

Read More

కరోనా పాజిటివ్​ వ్యక్తి అదృశ్యం

సారథి న్యూస్​, గుంటూరు : గుంటూరు జీజీహెచ్ నుంచి కరోనా పాజిటివ్ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ నెల 14వ తేదీన తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో సదరు వ్యక్తి చేరాడు. తెనాలి ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు లేక 16 రాత్రి జీజీహెచ్‌కు తరలించారు. జీజీహెచ్‌కు వచ్చిన నాటి నుంచి అతడు కనిపించకుండా పోయాడు. 12 రోజుల నుంచి భర్త ఆచూకీ కోసం అతని భార్య వెంకాయమ్మ ఆసుపత్రి చుట్టూ తిరుగుతోంది. ఆసుపత్రిలో ఎన్ని వార్డులు తిరిగినా… ఎంత మందిని […]

Read More
ఆ సత్తా మనకుంది

ఆ సత్తా మనకుంది

సారథి న్యూస్​, వరంగల్​ : ‘కరోనా లాంటి విపత్తులను అనేకం మనం ఎదుర్కొన్నాం..దీనిని ఎదుర్కొనే సత్తా మనకు ఉంది.. ప్రజలెవ్వరూ భయపడవద్దు’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్​, ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. మంత్రులు మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులతో  సీఎస్సార్ గార్డెన్స్ లో కోవిడ్ 19 పై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ మన రాష్ట్రాన్నే కాదు కరోనా మహమ్మారి యావత్ […]

Read More

అంత్యక్రియలకు ఆమడదూరం

సారథి న్యూస్​, కోదాడ : సూర్యాపేట జిల్లా సాలార్​జంగ్​పేటకు చెందిన వ్యక్తి కరోనా పాజిటివ్​ రావడంతో కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స నిమిత్తం చేరాడు. కానీ పరిస్థితి విషమించి సోమవారం ఆస్పత్రిలోనే చనిపోవడంతో అతడి మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి బంధువులు ముందుకు రాకపోవడంతో మునిసిపల్ కమిషనర్ ఆదేశానుసారం అధికారులు, సిబ్బంది సహాయంతో రాత్రి 8 గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్​స్పెక్టర్ దండు శ్రీను , హెల్త్ అసిస్టెంట్ మేరిగ అశోక్, జవాన్లు సిబ్బంది […]

Read More
దేశంలో పెరుగుతున్న కేసుల సంఖ్య

47 వేల కొత్తకేసులు

న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. గత 24 గంటల్లో 47,703 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 14,83,156 కు చేరింది. వరుసగా ఆరోరోజు 45 వేల కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయని వైద్యశాఖ అధికారులు తెలిపారు. మరోవైపు కరోనా మరణాల సంఖ్య భయంకరంగా పెరుగుతూనే ఉన్నది. ఇప్పటికి 33,425 మంది కరోనాతో మృతిచెందారు. 9,52,743 మంది డిశ్చార్జి కాగా.. 4,96,988 యాక్టివ్​ కేసులున్నాయి.

Read More

గూగుల్​ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: కరోనాను కట్టడి చేసేందుకు ప్రముఖ సాఫ్ట్​వేర్​ కంపెనీ గూగుల్​ కీలక నిర్ణయం తీసుకున్నది. తమ ఉద్యోగులకు ప్రస్తుతం కొనసాగిస్తున్న వర్క్​ప్రంహోం విధానాన్ని మరిన్ని రోజులు పొడగించింది. జూలై 2021 వరకు తమసంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు వర్క్​ప్రంహోంను పొడగిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఉద్యోగులకు కోసం వర్క్​ఫ్రం హోమ్​ను పొడిగించిన తొలి కంపెనీ గూగుల్​యే కావడం విశేషం. కాగా ఈ కంపెనీలో దాదాపుగా 2లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Read More
కరోనాపై ఇంత నిర్లక్ష్యమా

కరోనాపై ఇంత నిర్లక్ష్యమా

సారథిన్యూస్, రామడుగు: కరోనాను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని కాంగ్రెస్​ బీసీసెల్​ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్​ విమర్శించారు. కరీంనగర్​ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉండి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహించకుండా కరోనా వ్యాప్తికి కారణమవుతున్నదని ఆరోపించారు. సోమవారం ఆయన కరీంనగర్​ జిల్లా రామడుగలో మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో కరోనా వ్యాప్తికి బాధ్యత వహిస్తూ మంత్రులు ఈటల రాజేందర్​, గంగుల కమాలాకర్​, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి […]

Read More